Burra Someshwar Goud Strike on 42% reservation
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు పోరాడుతాం.
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్. బుర్ర సోమేశ్వర్ గౌడ్
రైతు ప్రస్థానం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం,మణుగూరులో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం లో జరిగిన సమావేశంలో బీసీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి బీసీలకు 42 శాతం .రిజర్వేషన్ రాష్ట్ర గవర్నర్ , కేంద్ర రాష్ట్రపతి వెంటనే అమలు చేయాలని, వారిని కోరడమైనది.. లేనియెడల తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం ప్రజల ఆగ్రహానికి గురవుతారని, కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి కావాల్సి వస్తది .ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే, మా తెలంగాణ రాష్ట్ర,బీసీ బిడ్డలు అంతా రాష్ట్రములో ఉన్న రోడ్లను నిర్బంధిస్తామని రోడ్లపైనే వంటావార్పు చేస్తామని , తెలంగాణ రాష్ట్ర బీసీలు అంతా కందిరీగల్లా కమ్ముకుంటామని ,మా బీసీల ఐక్యత ఏంటో చూపిస్తామని తెలియజేసుకుంటున్నాము. ఇంకా ఎన్ని రోజులు మా బీసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటారని మేము అడుగుతున్నాము మా బీసీలను విస్మరిస్తే ఏ రాజకీయ పార్టీకి అయినా పునాదులే ఉండయని హెచ్చరిస్తున్నాము.
కావున మాకు రావలసినటువంటి 42 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని కేంద్ర పెద్దలను కోరుకుంటున్నాము .ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి ,బుర్ర సోమేశ్వర్ గౌడ్ . మణుగూరు.మండల గౌరవ అధ్యక్షులు జీవీ ,మండల ప్రధాన కార్యదర్శి పెనుగొండ సాంబశివరావు , మండల సహాయ కార్యదర్శి ,ముత్యం రమేష్ గౌడ్ , గుర్రము శ్రీను, మధు , యాదవ రాజు తదితరులు పాల్గొన్నారు.