Bhoomi Pooja for the construction of Indiramma
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న బృహత్ పథకం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైన లబ్దిదారులతో కలిసి నిర్మాణ పనులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *కొప్పుల వేణారెడ్డి* గారు భూమిపూజ చేశారు.ఆత్మకూర్(ఎస్) మండలంలోని కందగట్ల గ్రామంలో బొల్లే రేణుక భర్త కృష్ణ చింత జానమ్మ భర్త వెంకన్న గార్ల లబ్దిదారుల ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సాయం పొందాలని కోరారు. త్వరగా ఇండ్లను నిర్మాణం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్, మాజీ జెడ్పిటిసి చింతమళ్ళ రమేష్,దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బైరు శైలేందేర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోగుల పద్మ సత్తిరెడ్డి, కరీం, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శిగ శ్రీనివాస్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు భూతం లింగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లే నర్సయ్య, మాజీ ఎంపిటిసి అమృ నాయక్, కటూరి రాములు, కేశవ రెడ్డి, శిగ రాములు, యుద్ధం తిరుమల్ రెడ్డి, బోనగిరి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.