ఏపీ రాజధానిగా అమరావతి: నూతన మాస్టర్ ప్లాన్ మరియు ఏపీ కొత్త మ్యాప్ | ap-new-map-2026-28-districts-amaravati-capital-highlight

ap-new-map-2026-28-districts-amaravati-capital-highlight

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణయాల ప్రకారం, రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తాజా మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ అధికారిక మ్యాప్‌ను ఈ నెల 2వ తేదీన ప్రచురించారు. ఇందులో మొత్తం 28 జిల్లాలను స్పష్టంగా చూపించారు.

ఈ మ్యాప్‌లో అత్యంత ముఖ్యమైన అంశం రాజధాని అమరావతి ప్రస్తావన. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల మధ్య ప్రాంతంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా (Capital) గుర్తించారు. అయితే అమరావతికి ప్రత్యేక సరిహద్దులు (బౌండరీలు) చూపించకుండా, కేవలం రాజధాని ప్రాంతంగా సూచించడం గమనార్హం.

ప్రజలకు పరిపాలన సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే ఉన్న 26 జిల్లాలకు అదనంగా మార్కాపురం, పోలవరం అనే రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఈ కొత్త జిల్లాల సరిహద్దులను కూడా తాజా మ్యాప్‌లో స్పష్టంగా చూపించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరిగింది.

ఈ మ్యాప్‌ను విడుదల చేయడానికి ప్రధాన కారణం ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో జిల్లా వారీగా సహాయక చర్యలు వేగంగా చేపట్టడానికి అవసరమైన స్పష్టమైన భౌగోళిక సమాచారం అందించడం. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత సరిహద్దుల విషయంలో ఉన్న సందిగ్ధతను ఈ మ్యాప్ తొలగించనుంది.


Leave a Comment