Allu Arjun not visiting Sri Teja due to case:కేసు ఉన్న కారనంగా శ్రీ తేజను పరామర్శించని అల్లు అర్జున్ 2024
కేసు కోర్టులో ఉన్న కారణంగా అల్లు అర్జున్ శ్రీ తేజను పరమర్షిణిచడానికి రాలేదు అని అన్న అల్లు అరవింద్.
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోకి సంధ్య థియేటర్‌కి వెళ్లిన కారణంగా తొక్కిసలాట జరిగి ఒకరి ప్రాణం పొగ మరొకరి పరిస్థి విషమంగా ఉన్న సంగతీ తెలిసిందే ఈ విషయం సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం హీరో పై మరియు థియేటర్ యాజమాన్యం పై కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే.దీని పై స్పందిస్తూ అల్లు అర్జున్ అప్పట్లో వారి కుటుంబ బాధ్య త నేనే తీసుకుంటాను అని చెప్పిన ఇంత వరకు అమ్మ చనిపోయి హాస్పిటల్లో సీరియస్ కండిషన్ ఉన్న బాబును ఇంతవరకు అల్లు అర్జున్ పరామర్శించక పోవడంతో ఫాన్స్ తో పాటు సామాన్యులు కూడా ఫైర్ అవుతున్నారు.
కేసు కోర్టులో ఉన్నందున తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ పరామర్శించలేకపోయారని ఆయన తండ్రి అల్లు అరవింద్ తెలిపారు. అందుకే ఆయన తరఫున బాలుడిని తాను పరామర్శించినట్లు చెప్పారు. కిమ్స్ ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రేవతి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం మాకు పూర్తి సహకారం అందించింది. తమకు మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు’ అని ఆయన పేర్కొన్నారు.సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను అల్లు అరవింద్ పరామర్శించారు. ఇవాళ సికింద్రాబాద్ కిమ్‌కు వెళ్లిన ఆయన వైద్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న థియేటర్ బయట తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోగా, బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇదే కేసులో హీరో అల్లు అర్జున్ జైలుకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే.