Agriculture profitable leaf vegitables 2026
తెలంగాణాలో ఇప్పుడు రబీ సీజన్ ముగుస్తున్నది.దాంతో పాటుగా రైతులు ఖరీఫ్ సీజన్ కోసం రైతులు తొందర పడుతున్నారు కూడా.ఐతే రైతులు ఇప్పుడు తమ సాగు విధానంలో కొద్దీ పాటి మార్పులు చేసుకుంటే అద్భుతమైన లాభాలను పొందవచ్చు. ఉల్లి, ఆలుగడ్డ సాగు చేసిన రైతుల యొక్క పొలాలు ఫిబ్రవరి నాటికి ఖాళీ అవుతుంటాయి. చాలా మంది రైతులు మార్చి నెలలో వేయబోయే టమాటా లేదా వంకాయ పంటల కోసం పొలాన్ని అప్పటివరకు ఖాళీగా వదిలేస్తుంటారు. కానీ ఆలా విరామం ఇవ్వకుండా కేవలం 40 నుంచి 50 రోజుల్లో చేతికి వచ్చే ఆకుకూరలను సాగు చేసి అదనపు ఆదాయాన్ని గడించవచ్చు…
ఫిబ్రవరి 10వ తేదీలోపు పొలం ఖాళీ అయిన వెంటనే తోటకూర, మెంతికూర, బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలను నాటుకోవాలి. ఈ పంటల ప్రాధాన్యత ఏమిటంటే, ఇవి నాటిన 15-20 రోజుల్లోనే మొదటి కోతకు వస్తాయి. ఎండలు పెరిగే కొద్దీ మార్కెట్‌లో ఆకుకూరలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి తద్వారా రైతులకు మంచి ధర కూడా లభిస్తుంది. ఆకుకూరల సాగులో పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది. ఒక ఎకరా పొలంలో ఆకుకూరలు వేయడానికి విత్తనాలు, ఎరువుల కోసం సుమారు రూ. 5,000 నుంచి రూ. 8,000 మాత్రమే ఖర్చవుతుంది. కానీ, దిగుబడి మార్కెట్ ధరను బట్టి కేవలం 40-50 రోజుల్లోనే రూ. 40,000 నుంచి రూ. 50,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. దీనివల్ల పొలంలో తేమ శాతం పెరిగి, భూమి సారాన్ని కోల్పోకుండా ఉంటుంది.
సాగు విధానం:
- ఆకుకూరల కోత పూర్తయిన వెంటనే పొలాన్ని శుభ్రం చేసి, దుక్కి దున్నుకోవాలి.
- బెడ్ ప్లాంటర్ సహాయంతో గట్లు ఏర్పాటు చేసుకోవాలి.
- ఒకే పొలంలో తక్కువ కాలంలో ఎక్కువ పంటలు తీయడాన్నే సాంద్ర సాగు అంటారు.
- ఆలుగడ్డ పంట తీసిన తర్వాత పొలాన్ని ఖాళీగా ఉంచకుండా, కలుపు మొక్కలను తొలగించి ముల్లంగి లేదా ఇతర ఆకుకూరలను సాగు చేయాలి.
- ఇవి 50 రోజుల్లోనే పూర్తవుతాయి.”ఆరు నెలలు.. మూడు పంటలు..










