Adilabad Farmer suicide in ICICI Bank Hall : బ్యాంకు సిబ్బంది ముందే రైతు ఆత్మా హత్య
బ్యాంకులో లోన్ తీసుకుని కట్టడం లేదని బ్యాంకు అధికారులు మందలించడంతో ఓ రైతు బ్యాంకు లోపలి వెళ్లి పురుగులమందు తాగి చనిపోయాడు
తెలంగాణాలో ఇంకా ఆగని రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు.ఎటు చూసిన ఏవ్ ఇప్పుడు మరో రైతు నేరుగా బ్యాంకు అధికారులు చూస్తుండాగానే ఆత్మా హత్య చేసుకున్నాడు.ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.బ్యాంకులో లోన్ తీసుకుని కట్టడం లేదని బ్యాంకు అధికారులు మందలించడంతో ఓ రైతు బ్యాంకు లోపలి వెళ్లి పురుగులమందు తాగి చనిపోయాడు.ఆదిలాబాద్ పట్టణంలోని ఐసిఐసిఐ బ్యాంక్ లో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తీసుకున్న అప్పు చెల్లించడం లేదని బ్యాంక్ అధికారులు వేధింపులకు పాల్పడడంతో బేల మండలం రేణిగూడకు చెందిన రైతు జాదవ్ దేవరావు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ ఐ సిఐసీఐ బ్యాంక్ లో దేవరావు మార్ట్ గేజ్ రుణం తీసుకున్నాడు. వాయిదా చెల్లించడం ఆలస్యం కావడంతో బ్యాంకు ఉద్యోగులు పదే పదే అడిగారు. దీంతో బ్యాంకులోకి మందు డబ్బా తీసుకుని వచ్చిన ఆయన అక్కడే మందు తాగాడు. ఆయనను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ తరలించారు. అక్కడ ఆయన మృత్యువాత పడ్డాడు. బ్యాంకు సిబ్బంది, అధికారుల వేధింపుల వల్లనే మృతి చెందాడని ఆరోపించిన బంధువులు బ్యాంకు ఎదుట ఆందోళన నిర్వహించారు.ఇప్పటికే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసాం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న ిన రైతుల ఆత్మ హత్యలు ఆగడం లేదు ఈ ఆత్మ హత్యల వలన కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలకు తావు దొరుకుతుందని పలువురు అంటున్నారు.