ఆధార్ సేవా కేంద్రాలను వ్యక్తిగతంగా సందర్శించాల్సిన | Aadhar Card Update Latest News 2025

Aadhar Card Update Latest News 2025

ఆధార్ అప్డేట్ ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న కొత్త పని.ఆధార్ లేకుంటే ఎలాంటి పథకాలు దరి చేరవు ఐతే ఇప్పుడు ఆధార్ వినియోగదారుల కోసం ప్రభుత్వం మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తోంది.

ఆధార్ అప్డేట్ ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న కొత్త పని.ఆధార్ లేకుంటే ఎలాంటి పథకాలు దరి చేరవు ఐతే ఇప్పుడు ఆధార్ వినియోగదారుల కోసం ప్రభుత్వం మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తోంది. ప్రాథమిక అవసరాల కోసం ఆధార్ సేవా కేంద్రాలను వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అవసరం లేకుండా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ‘ఈ-ఆధార్’యాప్ను ఉపయోగించి సులువుగా ఆన్లైన్లోనే వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ను నవంబర్లో ప్రారంభించబోతున్నట్లు అంచనాలున్నాయి.

ప్రభుత్వం తీసుకు వస్తున్న అప్ ద్వారా పేరు,చిరునామా,పుట్టిన తేదీ,మొబైల్ నంబర్,బయోమెట్రిక్ మార్పులు (వేలిముద్ర / కనుపాపలు) మినహా, ఆధార్ సేవా కేంద్రాలను సందర్శించకుండా అన్ని అప్డేట్లను డిజిటల్గా చేయవచ్చు.

ముఖ్య లక్షణాలు

  • ఏఐ ఫేస్ ఐడీ ఇంటిగ్రేషన్: సురక్షితమైన రిమోట్ యాక్సెస్,
  • ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం అనుమతిస్తుంది.
  • క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్:భౌతిక ఆధార్ ఫొటోకాపీల
  • న్ని తొలగిస్తుంది..ఆటో డాక్యుమెంట్ పొందడం: పాన్, పాస్ పోర్ట్, డ్రైవింగ్
  • లైసెన్స్, పీడీఎస్, ఎంఎన్ఆర్ఆజీఏ, యుటిలిటీ రికార్డుల నుంచి వెరిఫై చేసిన డేటాను తీసుకుంటుంది.

Leave a Comment