vaibhav-suryavanshi-ipl-brand-endorsement-12-crore-offer
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలంలో అతి చిన్న వయసులోనే కోట్లు పలికి చరిత్ర సృష్టించిన బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దశ తిరిగింది. మైదానంలో తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ ‘బేబీ మాన్స్టర్’ వైపు ఇప్పుడు కార్పొరేట్ దిగ్గజాలు క్యూ కడుతున్నాయి. కేవలం ఆటలోనే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్లు, స్పాన్సర్షిప్స్లోనూ ఈ కుర్రాడు సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్తున్నాడు. తాజాగా వైభవ్‌కు ఒక ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ నుంచి ఏటా రూ. 12 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్లు క్రీడా వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
బ్యాట్ స్పాన్సర్షిప్ నుంచి మల్టీ క్రోర్ డీల్స్ వరకు
సాధారణంగా టీనేజ్ క్రికెటర్లకు కెరీర్ ప్రారంభంలో స్పాన్సర్షిప్స్ రావడం చాలా అరుదు. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం తన బ్యాట్ స్పాన్సర్షిప్ ద్వారా ఏడాదికి రూ. 50 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు. అయితే ఐపీఎల్ క్రేజ్ తర్వాత అతని బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. ఏటా రూ. 12 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తూ ఒక టాప్ కంపెనీ ముందుకు రావడం క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ డీల్ గనుక ఓకే అయితే, ఇంత చిన్న వయసులో ఈ స్థాయి ఎండార్స్మెంట్ సాధించిన అరుదైన క్రికెటర్‌గా వైభవ్ నిలుస్తాడు.
బ్రాండ్ల రేసులో టైర్ కంపెనీలు.. ఇప్పటికే ఒక యాడ్‌లో!
భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల బ్యాట్లపై ‘MRF’, ‘CEAT’ వంటి ప్రముఖ టైర్ బ్రాండ్ల లోగోలు కనిపించేవి. ఇప్పుడు అదే తరహాలో దేశంలోని టాప్ టైర్ మేకింగ్ కంపెనీలు వైభవ్ సూర్యవంశీతో లాంగ్-టర్మ్ కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నాయి. కేవలం చర్చల దశలోనే కాకుండా, వైభవ్ అప్పుడే కార్పొరేట్ ప్రకటనల ప్రపంచంలోకి అడుగుపెట్టేశాడు. ప్రముఖ న్యూట్రిషనల్ హెల్త్ డ్రింక్ బ్రాండ్‌కు సంబంధించిన టీవీ కమర్షియల్ యాడ్‌లో ఈ యువ క్రికెటర్ ఇప్పటికే కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.
భవిష్యత్ స్టార్‌గా వైభవ్
భారత దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ వేదికగా తన ప్రతిభను చాటుకున్న వైభవ్, కేవలం ఒక క్రికెటర్‌గానే కాకుండా యాడ్ మార్కెట్లోనూ మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీగా మారుతున్నాడు. రాబోయే రోజుల్లో అతను మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని, ఈ రూ. 12 కోట్ల డీల్ దానికి ఆరంభం మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
- Youtube Channel: Click Here
- Horror Stories: Click Here
- Entertainment: Click Here










