latest-anganwadi-jobs-in-andhrapradesh-ap-anganwadi
వై.యస్.ఆర్. కడప జిల్లా యందలి వివిధ ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా యున్నటువంటి దిగువ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీ కొరకు అమలులో యున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.01.07.2026 వ తేదీ నాటికి అభ్యర్థులు 21 సం. దాటి 35 సం. లోపు వయ్యస్సు కలవారై యుండవలయును.అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకురాలు పోస్టు కొరకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది: 13/04/2026 సాయంత్రము 5:00 గంటల లోపు
- ఇంటర్వ్యూ నిర్వహణ తేది: 23 104/2026
- ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము: సంబందిత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయము.
వయోపరిమితి
01.07.2026 వ తేదీ నాటికి అభ్యర్థులు 21 సం. దాటి 35 సం. లోపు వయ్యస్సు కలవారై యుండవలయును.
అర్హత
- 01.07.2026 వ తేదీ నాటికి అభ్యర్థులు 21 సం. దాటి 35 సం. లోపు వయ్యస్సు కలవారై యుండవలయును.
- దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.
- అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకురాలు పోస్టు కొరకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును.
- యస్.సి./యస్.టి. హబిటేషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడి కేంద్రముల (మెయిన్/మినీ) యందు కేవలం యస్.సి. / యస్.టి. అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయబడుదురు.
- నోటిఫై చేయబడిన యస్.సి. / యస్.టి. అంగన్వాడి కేంద్రములకు యస్.సి. / యస్.టి. అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలయును. మరియు నోటిఫై చేయబడిన యస్.సి./యస్.టి. అంగన్వాడి కేంద్రముల పోస్టులకు సంబందించి 21 సం. లు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు, 18 సం. వయస్సున్న అభ్యర్థుల దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడును (18 to 35 years of age, ear marked sanctioned)
15.05.2015 ప్రకారం దిగువ తెలుపబడిన పారామీటర్లు మరియు మార్కుల ప్రాతిపదికన అంగన్వాడి కార్యకర్త, సహాయకురాలు, మరియు మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులకు అభ్యర్థులను జిల్లా ఎంపిక కమిటీ వారిచే ఎంపిక చేయుట జరుగును.
S. No. Parameters 1 If 10th class passed 2 3(a) 3(b) 4 Pre-School teacher training or crèche and pre-school management training conducted by the board of intermediate or recognized university/working as ECE workers Widow Widow with minor children (additional) Candidate who is a orphan and who has been an inmate of Bala Sadan/ Govt. institutions/ Govt. recognized institutions 5 Differently abled candidates Marks 50 5 5 5 10 5 S. No.
Parameters 6 Oral interview Marks 20 TOTAL: 100 కావున అభ్యర్థులు పై తెలుపబడిన 1 నుండి 5 పారామీటర్లకు సంబందించిన పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు ఖచ్చితముగా నమోదు చేసి వాటికి సంబందించిన దృవీకరణపత్రముల నకలులు మరియు పై తెలుపబడిన అన్ని అర్హతలు తదితరములకు సంబందించిన దృవీకరణపత్రముల నకలులు ఎదేనా గజిటెడ్ అధికారి వారిచే అటెస్టేషన్ గావింపబడిన నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును. అట్లు జతపరచని ఎడల వాటికి సంబందించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు.
ప్రభుత్వము వారి మెమో సంఖ్య. WDC02-16030/67/2021-ICDS-WD&CW, Dt 22/09/2021 of the Director, WD & CW, A.P. Guntur వారి ప్రకారం మినీ అంగ వాడీ వర్కర్ల ఎంపికలో వికలాంగులకు రిజర్వేషన్ నియమం పిల్లల భద్రత దృష్ట్యా పూర్తిగా మినహాయించబడుటయినది. అంగన్ వాడీ కార్యకర్తలు మరియు సహాయకురాలులకు సంబంధించి, 6 (అంధత్వం మరియు తక్కువ దృష్టి), 31 (చెవిటివారు మరియు వినికిడి లోపం) మరియు 86 (ఆటిజం, మేధోపరమైన వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసిక వైకల్యం, బహుళ వైకల్యాలు) వ రోస్టర్ పాయింట్ రిజర్వేషన్ కు మినహాయింపు ఉంది.
పిల్లల భద్రత మరియు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, మైనర్ లోకోమోటర్ వైకల్యం ఉన్న వ్యక్తులు మాత్రమే పిల్లల సంరక్షణ మరియు గృహ సందర్శనల సామర్థ్యానికి ఆటంకం కలిగించని విధంగా 6, 31, 56, మరియు 86 రోస్టర్ పాయింట్స్ లకు బదులుగ మైనర్ లోకోమోటర్ వ్యక్తులకు అర్హత కల్పించడము జరుగుతుంది. మైనర్ లోకోమోటర్ వైకల్యం ఉన్న అటువంటి అర్హత గల అభ్యర్థులు లేకుంటే, 6, 31 మరియు 86 వద్ద ఉన్న రోస్టర్ పాయింట్లను తరువాత నోటిఫికేషన్ నందు వైకల్యం ఉన్న అభ్యర్థులలో కాకుండా ఇతరులతో నింపబడుదురు.
56 వద్ద ఉన్న రోస్టర్ పాయింట్ మాత్రమే తదుపరి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు ఫార్వార్డ్ చేయబడవచ్చు మరియు రెండవ నోటిఫికేషన్లో కూడా మైనర్ లోకోమోటర్ వైకల్యం ఉన్న అర్హత గల అభ్యర్థి లేకుంటే, రోస్టర్ పాయింట్ 56 కూడా వికలాంగులు కాకుండా ఇతరులతో నింపవచ్చు. కావున తదనుగుణంగా ఈ ప్రకటన యందు రోస్టర్ పాయింట్లు కేటాయించడం జరిగినది. VI) ప్రకటింపబడిన పోస్టులలో గౌరవ న్యాయస్థానముల యందు కేసులు పెండింగులో ఉన్న వాటి భర్తీనకు సంబందించి, ఆయా కేసులకు సంబందించి వెలువడు తదుపరి ఉత్తర్వులు మేరకు వారి నియామకము రద్దు పరచుట కాని, కొనసాగింపు కాని జరుగును.
VII) అంగన్ వాడీ కార్యకర్త (Main & Mini), ಅఅంగన్ వాడీ హెల్పరు గౌరవ కార్యకర్తలు, కావున ఈ నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబందనల ప్రకారము గౌరవ వేతనము మాత్రమే చెల్లించబడును. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్ని దృవీకరణ పత్రములను ఏదేనా గజిటెడ్ అధికారి వారితో అటేస్టేషన్ చేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు 13/04/2026 సాయంత్రము 5:00 గంటల లోపు సమర్పించి తగు రశీదు పొందవలయును.
- Join Whats App Channel: Click Here
- Read Notification: Click Here
- Apply Now: Click Here
- Youtube Channel: Click Here
- Horror Stories: Click Here
- Entertainment: Click Here










