MAMIDI KONALA MEENA SONG LYRICS NAGADURGA
మామిడి కొనల మీనా మబ్బులేమో నిలిచినాయి
మామిడి కోనల మీనా మబ్బులేమో నిలిచినాయి
మనసులు ఎవ్వరి మీదనే ఓ బూజవ్వ
మనసులు ఎవ్వరి మీదనే…
యాప కొమ్మల మీనా పొద్దులేమో గూకినాయి
యాప కొమ్మల మీనా పొద్దులేమో గూకినాయి
యాపతి ఎవ్వరి కోసమే ఓ బూజవ్వ
యాపతి ఎవ్వరి కోసమే….
గల్లా గల్లల్లా లుంగీ నడుముకు సూట్టి
తెల్ల తెల్లటి అంగీకి అత్తరు కొట్టి
బంగారి ముద్దుటుంగరాలే పెట్టి
బాల మీసాలే దువ్వుకుంటూ
నా కొరకే దారి పట్టే
యాపతి సోపతి కోసమే ఓ నాగవ్వ
సోపతి యాపతి కోసమే…
యాపతి సోపతి కోసమే ఓ నాగవ్వ
సోపతి యాపతి కోసమే…
మామిడి కోనల మీనా మబ్బులేమో నిలిచినాయి.
మామిడి కొనల మీనా మబ్బులేమో నిలిచినాయి
మనసులు ఎవ్వరి మీదనే ఓ బూజవ్వ
మనసులు ఎవ్వరి మీదనే…
చింత చిగురుల మీనా చిలకలేమో వాలినాయి
చింత చిగురుల మీనా చిలకలేమో వాలినాయి
చిత్తము ఎవ్వరి కోసమే ఓ బూజవ్వ
చిత్తము ఎవ్వరి కోసమేమే…
చిలుక పచ్చటి చీర సింగులు చెక్కి
వాని జాడ గాచి ఎదురుచూస్తే బంగుల ఎక్కి
చిన్నోని సోయిల చెంపలు ఎరుపెక్కి
రాలుగాయి నా మనసు వాని
ముసి ముసి నువ్వుల్లో చిక్కే
చిత్తం చిన్నోని మీదనే ఓ నాగవ్వ
మొత్తం మేనోని మీదనే…
చిత్తం చిన్నోని మీదనే ఓ నాగవ్వ
మొత్తం మేనోని మీదనే…
మామిడి కొనల మీనా మబ్బులేమో నిలిచినాయి.
మామిడి కోనల మీనా మబ్బులేమో నిలిచినాయి
మనసులు ఎవ్వరి మీదనే ఓ బూజవ్వ
మనసులు ఎవ్వరి మీదనే…
బంతి పువ్వుల మీద బాసలేమో పూసినాయీ
బంతి పువ్వుల మీద బాసలేమో పూసినాయీ
బామలు ఎవ్వాలి మీదనే ఓ బుజ్జవ్వ
బామలు ఎవ్వాలి మీదనే
బోలు గజ్జెల పట్టీలే పెట్టుకుని
బుగ్గలున్న లంగా జాకీటే కట్టుకొని
బుట్ట కమ్మలు బొట్టే దిద్దుకుని
ఇరుగు పొడుగంటు లేని యేళ్ళ
వాని అరుగు దొక్కంగా
బామలు నా బావ మీదనే ఓ నాగవ్వ
బరబరు వాని మీదనే
బామలు నా బావ మీదనే ఓ నాగవ్వ
బాజాప్తా వాని మీదనే
Follow Links
- Join Whats App Channel: Click Here
- Youtube Channel: Click Here
- Horror Stories: Click Here
- Entertainment: Click Here










