భూమి అమ్మనందుకు తండ్రిని హత్య చేసిన కుమారుడు – పోలీసుల వేగవంతమైన చర్య 2026

భూమి అమ్మనందుకు తండ్రిని హత్య చేసిన కుమారుడు

తన చెల్లెలి పెళ్లి కోసం తండ్రి పేరున్న 5 గుంటల భూమిని అమ్మనందుకు తండ్రి హత్య

కొడుకును పోలీసులకి పట్టించిన తల్లి

రైతు ప్రస్థానం: షాద్‌నగర్ పట్టణ పరిధిలో సంచలనం సృష్టించిన తండ్రి హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. తన తండ్రిని హత్య చేసిన కుమారుడిని షాద్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.కేసు వివరాలు ఇలా ఉన్నాయి..

ఫిర్యాదుదారురాలు శ్రీమతి మెగావత్ సోనీ తన భర్త పాల్త్యవత్ బాలు (43), వృత్తి వ్యవసాయం, నివాసం దేవునిబండ తండా, ఫరూక్‌నగర్ మండలం, తేదీ 10-02-2026న కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తన కుమారుడు పాల్త్యవత్ మోహన్ @ గుండు పై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా 12-02-2026 ఉదయం సుమారు 9:30 గంటలకు నిందితుడు తన ఆటోలో పారిపోతుండగా కేశంపేట్ ఎక్స్ రోడ్డు, యాదాద్రి హోటల్ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు.

Follow On Whats App: Click Here

తన చెల్లెలి పెళ్లి కోసం తండ్రి పేరున్న 5 గుంటల భూమిని అమ్మాలని కోరగా తండ్రి నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని తెలిపాడు. ఈ నేపథ్యంలో 08-02-2026న తండ్రిని ఆటోలో తీసుకెళ్లి, షాద్‌నగర్‌లో మద్యం తాగించి, అనంతరం నేరెళ్ల చెరువు గ్రామ శివారులోని చెరువు గుంతలో తోసివేసి హత్య చేసినట్లు వెల్లడించాడు.
పోలీసుల పర్యవేక్షణలో కేసు ఛేదించిన..ఈ కేసు విచారణ షాద్‌నగర్ డీసీపీ శ్రీమతి సిహెచ్ శిరీష గారు, ఏసీపీ ఎస్ లక్ష్మీనారాయణ గారు, శ్రీ కె విజయ్ కుమార్ గారి పర్యవేక్షణలో జరిగింది. విచారణాధికారి ఎస్ వెంకటేశ్వర్లు DI, శ్రీమతి సుశీల WSI, హెడ్ కానిస్టేబుళ్లు/పీసీలు బాల్‌రాజు, మోహన్, రాజేష్, జోత్స్న, నరేందర్ తదితరులు కీలక పాత్ర పోషించారు. వారికి పై అధికారుల ద్వారా రివార్డులు అందజేయనున్నారు.

Leave a Comment