రాష్ట్రంలో ప్రతీ జలాశయం నిండాలి ప్రతి ఎకరానికి సాగునీరు అందాలి | Cm Chandrababu Naidu Orders to Projects 2026

Cm Chandrababu Naidu Orders to Projects

రాష్ట్రంలో ప్రతీ జలాశయం నిండాలి… ప్రతి ఎకరానికి సాగునీరు అందాలి అనే సంకల్పంతో ఏర్పాటు చేసిన వ్యవస్థే సాగు నీటి సంఘాలు. సమర్థ నీటి నిర్వహణలో నీటి వినియోగ దారుల సంఘాల పాత్ర అత్యంత కీలకం.

రాష్ట్రంలో ప్రతీ జలాశయం నిండాలి… ప్రతి ఎకరానికి సాగునీరు అందాలి అనే సంకల్పంతో ఏర్పాటు చేసిన వ్యవస్థే సాగు నీటి సంఘాలు. సమర్థ నీటి నిర్వహణలో నీటి వినియోగ దారుల సంఘాల పాత్ర అత్యంత కీలకం. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6,047 నీటి వినియోగదారుల సంఘాలు, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 58 ప్రాజెక్ట్ కమిటీలకు ఎన్నికలు నిర్వహించాం.

సుమారు 60,000 మంది సంఘ సభ్యులు సాగునీటి నిర్వహణలో ప్రత్యక్ష భాగస్వాములయ్యారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.344 కోట్లతో 7,197 O&M పనులు రైతు సంఘాల ద్వారా చేపట్టాం. క్షేత్ర స్థాయి కాలువల నిర్వహణ, వారబందీ విధానం అమలు, నీటి పన్నుల వసూలు, వివాదాల పరిష్కారంలో నీటి వినియోగదారుల సంఘాలు అద్భుతంగా పని చేస్తున్నాయి. భూగర్భజలాల పెంపు, సాగు-తాగు నీరు, పరిశ్రమలకు కొరత లేకుండా నీటిని ఇవ్వడం, భవిష్యత్ అవసరాలకు నీటి వనరులను కాపాడు కోవడం లక్ష్యంతో పనిచేసేలా అమరావతిలో జరిగిన సాగునీటి సంఘాల సమావేశంలో చర్చించి, సంకల్పం తీసుకున్నాం. నీటి భద్రత సాధించడంలో సాగునీటి సంఘాలు మరింత కీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చాను.

Leave a Comment