Rythu Bharosa Payment Update on February 2026
రైతులకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందించడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది..రాష్ట్రంలో రైతులకు ఆర్థికంగా సహాయం అందించేందుకు రైతు భరోసా పథకం రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన సంక్షేమ పథకాలలో ఒకటి. ఈ పథకం ద్వారా అయితే రైతులకు యసంగి విడత అందాల్సిన రూ.6,000 చెల్లింపులు కొంత ఆలస్యమవుతున్నాయని సమాచారం వెలువడింది. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం సాగు విస్తీర్ణంపై జరుగుతున్న శాటిలైట్ సర్వే అని అధికారులు వెల్లడించారు.
శాటిలైట్ సర్వే ఎందుకు చేస్తున్నారు?
శాటిలైట్ సర్వే ద్వారా భూమి వినియోగం, సాగు స్థితి, పంటల వివరాలు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. కాబట్టి రాష్ట్రంలో వాస్తవంగా ఎంత భూమి సాగులో ఉందో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఈ ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన రైతులకు మాత్రమే పథకం ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఈ సర్వేను ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించడం కోసం వ్యవసాయ నిపుణుల సహకారంతీసుకోనున్నారు. జిల్లాలు, మండలాలు వారీగా సాగు వివరాలను సేకరించి తుది నివేదిక రూపొందిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. సాగు భూములపై శాటిలైట్ సర్వే
- రైతు భరోసా పథకం నిజంగా పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే అందేలా ప్రభుత్వం శాటిలైట్ సర్వే నిర్వహిస్తోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో సాగు భూముల వివరాలను మ్యాప్‌ల ఆధారంగా సేకరిస్తున్నారు. దాదాపు 10 వేల రెవెన్యూ గ్రామాల్లో సాగు పరిస్థితులను పరిశీలించారు.
- ఈ సర్వేలో సుమారు 10 శాతం భూముల్లో పంటలు వేయలేదని గుర్తించినట్లు సమాచారం. దీంతో ఈసారి రైతు భరోసా పొందే రైతుల సంఖ్య తగ్గే అవకాశముంది.










