simple Way to Aadhar To Pan Link In Mobile
మనం ఎక్కడైనా లావాదేవీలు జరపాలంటే కావలసిన ముఖ్యమైన కార్డు పాన్ కార్డ్.ఇప్పుడు పాన్ కార్డును ఖచ్చితంగా ఆధార్ కార్డ్ తో లింక్ చేయాలి అని కేంద్రం చెప్తోంది.ఒక వేళా ఆధార్ కార్డు తో లింక్ చేయకుంటే మీ పాన్ కార్డ్ చెల్లుబాటులో లేకుండా డీ యాక్టివ్ చేయబడుతుంది. ఇప్పటికే పలుమార్లు ఉచితంగా లింక్ చేయడానికి గడువు పెంచుతూ వచ్చిన కేంద్రం ఇప్పుడు డబ్బులు చెల్లించి లింక్ చేసుకునే విధంగా విధానాలను తీసుకువచ్చింది. 2025 డిసెంబర్ 31వ తేదీ ముగిసే లోపు పాన్ ఆధార్ లింక్ చేయకపోతే ఆ పాన్ కార్డు చెల్లుబాటు అవ్వకుండా .రద్దు చేయబడుతుంది.కాబట్టి మీరు ఇప్పటికే ఆధార్ పాన్ లింక్ చేసి ఉంటే వెల్ అండ్ గుడ్.ఒకవేళ మీరు ఆధార్ కార్డుతో కనుక మీ పాన్ కార్డు లింక్ చేయకపోతే వెంటనే చేసుకోండి. మీరే సొంతంగా ఆన్లైన్ ఆధార్ పాన్ లింక్ చేసుకోవడానికి కూడా వీలుంది.
ఎలా లింక్ చేయాలి
- ముందు మీ పాన్ ఆధార్ లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది కాబట్టి, ఆన్లైన్ లో చెక్ చేయండి.
- దీని కోసం ప్రభుత్వ ఇన్కమ్ టాక్స్ సైట్ www.incometax.gov.in/iec/foportal ద్వారా మీరు మీ లింక్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.
- దీనికోసం పైన తెలిపి ఇన్కమ్ టాక్స్ సైట్ ఓపెన్ చేసి మెనూ చివరిలో కనిపించే లింక్ ఆధార్ స్టేటస్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
- క్లిక్ చేసిన తర్వాత లింక్ స్టేటస్ కోసం చెకింగ్ కోసం పాన్ కార్డు మరియు ఆధార్ నెంబర్ అడుగుతూ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- పాన్ ఆధార్ కార్డు లింక్ ని మీరే స్వయంగా నిర్వహించే అవకాశం ప్రభుత్వం అందించింది.
- దీనికోసం పైన తెలిపిన సైట్ ఓపెన్ చేసి క్విక్ లింక్స్ లో అడుగున లింక్ ఆధార్ స్టేటస్ ట్యాబ్ క్రింద ఉన్న ‘Link Aadhar’ క్లిక్ చేయండి మరియు మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇది మీకు ఆధార్ మరియు పాన్ నెంబర్ నమోదు చేయడానికి రెండు బాక్స్ లు ఉంటాయి.
- ఇక్కడ అడిగిన వద్ద మీ పాన్ మరియు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వాలి డేట్ చేయండి.
- ఇక్కడ ఈ సైట్ మీ ఆధార్ మరియు పాన్ వివరాలు (పేరు) సరిగా ఉన్నా లేదో చెక్ చేస్తుంది.
- మీరు అందించిన వివరాలు సరిగ్గా ఉంటే మీరు పేమెంట్ పేజీ కి మల్లించ బడతారు.
- ఇక్కడ వివరాలు అందించి పేమెంట్ అందిస్తే మీ పాన్ మరియు ఆధార్ లింక్ ప్రాసెస్ ని పూర్తి చేస్తుంది.
- ఒకవేళ మీ ఆధార్ మరియు పాన్ కార్డ్ లో పేరు లేదా పుట్టిన తేదీ వంటి వివరాలు తప్పుగా ఉంటే మీరు తప్పుగా ఉన్న వివరాలు ముందుగా సరి చేసుకోవాలి మరియు ఆ తర్వాత ఈ లింక్ ప్రాసెస్ చేయాలి.









