80% సబ్సిడీతో ట్రాక్టర్ మరియు ఇంకా ఎన్నో వ్యవసాయ పనిముట్లు| SMAM scheme full details and eligibility

SMAM scheme full details and eligibility

కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ ను అందించింది.దేశంలో ఉన్న అందరు రైతులకు 50 నుండి 80 శాతం వరకు సబ్సిడీని అందించి వారి వ్యవసాయానికి సహాయపడనుంది.గతంలో పశు సంపద మీద ఆధారపడి పని చేసిన రైతులు ఇప్పుడు అధికమొత్తంలో పెరిగిన ఖర్చులు తగ్గించుకోవడం కోసం టెక్నాలజీ మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్నారు.

ఐతే ఇప్పుడు చిన్న సన్న కారు రైతులకు టెక్నాలజీని చేరవేయడం కోసం కేంద్రం సబ్సిడీపై వ్యవసాయ పని మెట్లను అందించనుంది.ఎలా అప్లై చేసుకోవాలి వారికి కావలసిన డాకుమెంట్స్ ఏంటి ఎంత మొత్తంలో మనకు సబ్సిడీ అందుతుంది.ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది చూద్దాం..

వివరణ

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతును ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి అనే ఉద్దేశంతో సబ్సిడీని అందించి వారికి వ్యవసాయ పనిముట్లనూ అందిస్తుంది.కేంద్ర ప్రవేశ పెట్టిన పథకం పేరు సబ్-మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీలను అందిస్తుంది. పథకం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(RKVY) కింద భారత ప్రభుత్వ చొరవతో నడుస్తుంది.

పథకం కింద ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు మరియు డ్రోన్‌ల వంటి వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయడానికి రైతులకు ఆర్థిక సహాయం (సబ్సిడీలు) అందిస్తుంది మరియు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, శ్రమ ఖర్చులను తగ్గించడం మరియు వ్యవసాయ కార్యకలాపాలను వేగవంతం చేయడం లక్ష్యంగా పని చేస్తుంది మరి ముఖ్యంగా చిన్న రైతులకు యాంత్రీకరణను అందుబాటులోకి తీసుకురావడానికి కస్టమ్ హైరింగ్ సెంటర్‌లను (CHCలు) ప్రోత్సహించడానికి పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇది పరికరాల కొనుగోలు, CHCలను స్థాపించడం మరియు అవగాహన కార్యక్రమాలను కవర్ చేస్తుంది, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధులను పంచుకోవడం, మహిళా రైతులకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు డ్రోన్‌ల వంటి హైటెక్ యంత్రాలను ప్రవేశపెట్టడం వంటివి ఇందులో ఉన్నాయి.  చిన్న/సన్నకారు/SC/ST/మహిళా రైతులకు 50% ఆర్థిక సహాయం అందిస్తుంది ఇండివిసుఅల్గా మరియు సమూహలుగా ఏర్పడిన వారి కోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లను (CHCలు) స్థాపించడానికి అధిక రేట్లతో అందిస్తుంది, ఈశాన్య ప్రాంతాలకు 95% కూడా ఉంది.

సబ్సిడీని కేంద్రం మరియు రాష్ట్రాలు పంచుకుంటాయి (సాధారణ రాష్ట్రాలకు 60:40, NER/హిమాలయ రాష్ట్రాలకు 90:10) మరియు agrimachinery.nic.in పోర్టల్ ద్వారా లబ్ధిదారులకు నేరుగా చెల్లిస్తారు, అధిక ఉత్పాదకత కోసం ఆధునిక సాధనాలను స్వీకరించడాన్ని ప్రోత్సహిస్తారు..

అర్హులు ఎవరు

  • పథకం కింద ప్రతి ఒక్క రైతు (చిన్న,సన్నకారు మరు పెద్ద రైతులు )అప్పికేషన్ చేసుకోవచ్చు.
  • మహిళా సంఘాలు ,fpo లు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • సాధారణంగా ఆర్థికంగా బలహీనమైన రైతులకు మరియు ఇతర కేంద్ర పథకాల నుండి ఇలాంటి సబ్సిడీలు పొందని వారికి ప్రయోజనాలను అందిస్తాయి..
  • మహిళా రైతులు కూడా అప్లై చేసుకోవచ్చు.
  • సహకార సంఘాలు
  • వినియోగదారుల సమూహాలు మరియు వ్యవస్థాపకులు.
  • స్థానిక భారతీయ పౌరుడు అయి ఉండాలి.
  • ప్రాధాన్యత: మహిళా రైతులకు ప్రాధాన్యత లభిస్తుంది.

అందుబాటులో ఉన్న యూనిట్స్

  • ట్రాక్టర్
  • పవర్ టిల్లేర్
  • రోటవేటర్
  • డ్రోన్స్
  • సీడ్ డ్రిల్స్
  • సీడ్ డ్రైయర్ మరియు రైతులకు అవసరాలకు అనుగుణంగా ఉండే యాంత్రిక పనిముట్లు.

సబ్సిడీ

  • SC మహిళా మరియు ఇతరులకు 50% వరకు ప్రతి మిషన్ పైన సబ్సిడీ ఉంటుంది.
  • బీసీ మహిళా మరియు ఇతరులకు 40% వరకు ప్రతి మిషన్ పైన సబ్సిడీ ఉంటుంది.
  • st మహిళా మరియు ఇతరులకు ఫారెస్ట్ రైట్స్ ఆక్ట్ కింద పట్టా బుక్ ఉంటె 90% లేదంటే 50% సబ్సిడీ అందుతుంది.
  • మహిళలు మహిళా సంఘాల నుండి పథకానికి అప్లై చేస్తే 80% వరకు ప్రతి మిషన్ పైన సబ్సిడీ ఉంటుంది.

తయారీ కంపెనీలకు సబ్సిడీ

  • ప్రాజెక్ట్ వ్యయంలో 40% (₹250 లక్షల వరకు).
  • NE రాష్ట్రాల్లో కొన్ని యంత్రాలకు 100% (₹1.25 లక్షల వరకు).
  • సబ్సిడీ మొత్తాన్ని నేరుగా బెనిఫిషరీ ఖాతాలోకి dbt విధానంలో జమ చేయబడతాయి.
  • సబ్సిడీని అందచేయడం కోసం కేంద్రం సాధారణ రాష్ట్రాలకు 60% ఈశాన్య (నార్త్ ఈస్ట్ )రాష్ట్రాలకు 90 శాతం సబ్సిడీ అందిస్తుంది..

కావలసిన ధ్రువ పత్రాలు

  • పట్టా పాసుబుక్
  • kyc చేయబడిన ఆధార్ కార్డు
  • రైతు పాస్ ఫోటో
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  • చిరునామా దృవీకరణ పత్రం
  • బ్యాంకు పాస్ బుక్
  • తప్పుడు సమాచారం అందించినచొ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వబడుతుంది.

నోట్ : DBT పోర్టల్లో నమోదు చేసుకునేటప్పుడు రైతు డ్రాప్ డౌన్ జాబితా నుండి సరైన జిల్లా, ఉప జిల్లా, బ్లాక్ మరియు గ్రామాన్ని ఎంచుకోవాలి. రైతు పేరు ఆధార్ కార్డు ప్రకారం ఉండాలి. రైతు వర్గం (SC/ST/జనరల్), రైతు రకం (చిన్న/సన్నకారు/పెద్ద) మరియు లింగం (పురుష/స్త్రీ) సరిగ్గా అందించాలి, లేకుంటే భౌతిక ధృవీకరణ సమయంలో దరఖాస్తును రద్దు చేస్తారు. సబ్సీడీ పొందడానికి సరైన వివరాలను అందించడం రైతు బాధ్యత.

Apply Now

Guidlines 2020 – 21

Guidlines 2024

Frequently Asking Quetions

Leave a Comment