Husband and aunty harass her for being black
వినుకొండలో విచిత్ర సమస్యలో చిక్కుకున్న కోడలు
నల్లగా ఉన్నానని భర్త, అత్త,మామ వేధిస్తున్నారని ఆవేదన
నల్లగా ఉంటే అశుభాలు జరుగుతున్నాయని లేనిపోని విమర్శలు చేస్తున్నారు
తనకు న్యాయం చేయాలని అత్త ఇంటి ముందు ఆందోళనకి దిగిన కోడలు గోపి లక్ష్మి.
పల్నాడు జిల్లా: వినుకొండ పట్టణంలో ఆదివారం నుండి అత్త ఇంటి ఎదుట ఓ కోడలు బయటాయించి ఆందోళన చేస్తుంది. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన గోపి లక్ష్మికి, పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డు చౌడమ్మ వీధికి చెందిన వినుకొండ కోటేశ్వరరావు తో ఏడాది జూన్ 4 వ తేదీన వివాహం అయిందని, పెళ్లి జరిగిన రెండు నెలల నుండి భర్త, అత్త శేషమ్మ, మామ వెంకటేశ్వర్లు వేధిస్తున్నారని బాధితురాలు తెలిపారు. తాను నల్లగా ఉన్నానని భర్త, నీవు మా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి అశుభాలు జరుగుతున్నాయని అత్త మామ వేధిస్తున్నట్లు బాధితురాలు గోపి లక్ష్మి తెలిపింది.
ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబంలో ఇస్తే నా కూతురు బాగా బతుకుతుందని భావించిన నా తల్లిదండ్రులు గుంతనాల వెంకటనారాయణ హనుమాయమ్మ మాకున్న రెండు ఎకరాల పొలం తాకట్టుపెట్టి 12 లక్షలు డబ్బులు, 25 సబర్ల బంగారం కట్నం గా ఇచ్చినట్లు తెలిపారు. మీ పుట్టింటి నుంచి డబ్బులు తెమ్మని భర్త,అత్త, మామ చేస్తున్న వరకట్న వేధింపులు మా తల్లిదండ్రుల దృష్టికి తీసుకు వెళ్లగా వారు పెద్ద మనుషులతో కలిసి వచ్చి మాట్లాడితే అమ్మాయి నల్లగా ఉంది నాకు అక్కర్లేదని భర్త కోటేశ్వరరావు, నీవు వచ్చినప్పటినుండి మాకు బాగా లేదంటే మామ వెంకటేశ్వర్లు, అత్త శేషమ్మ లు అంటున్నారని రోధిస్తూ బాధితురాలు వివరిస్తుంది. మహా అయితే పోలీసులు కేసు పెడతారు, మాకు పుష్కలంగా రాజకీయ అండ దండలు ఉన్నాయి. బెయిల్ మీద బయటకు వస్తాం అంతకంటే ఏమవుతుందని బెదిరిస్తున్నట్లు తెలిపారు. డబ్బులు కోసం యువతులను మోసం చేసి పెళ్లి చేసుకుని వేదించే ఇటువంటి వారిని కఠినంగా శిక్షించి నాకు న్యాయం చేయాలని బాధితురాలు గోపి లక్ష్మి వేదన వ్యక్తం చేస్తుంది.









