New mobile includeed governement default app
మొబైల్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ . కొత్తగా తయారయ్యే మొబైళ్లలో కేంద్రం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ను డిఫాల్ట్ అందించాలని సూచించింది.
ఈ మేరకు ‘రాయిటర్స్’ వార్తా సంస్థ తన కథనంలో తేలింది . ఇతర యాప్ల మాదిరిగా ఈ యాప్ను కూడా యూజర్లు డిలీట్ చేయడం కుదరదు.
దేశంలో దాదాపు 100 కోట్లకు పైగా మొబైల్ వినియోగదారులు ఉన్నారు. దీంతో సైబర్ నేరాలు, చోరీల వంటివి తలనొప్పిగా మారాయి. ఈ క్రమంలోనే పోయిన మొబైళ్లను గుర్తించేందుకు ఈ ఏడాది జనవరిలో కేబీద్రం అప్ ను విడుదల చేసింది. దీని సాయంతో ఇప్పటి వరకు సుమారు 7 లక్షలకు పైగా చోరీకి గురైన ఫోన్లను కేంద్రం గుర్తించింది. సైబర్ సెక్యూరిటీ ముప్పులను ఎదుర్కోవడంలో, ఐఎంఈఐ స్పూఫింగ్ను నివారించడంలో ఈ యాప్ ఉపయోగపడుతోంది.
ఈ క్రమంలోనే మొబైల్లో ఈ యాప్ డిఫాల్ట్ ఉండేలా ఆయా టెలికాం సంస్థలను కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది.ఈ యాప్ ఇన్స్టలేషన్ అమలుకు మొబైల్ కంపెనీలకు కేంద్రం 90 రోజులు గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సప్లయ్ చైన్లో ఉన్న స్మార్ట్ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఈ యాప్ను అందించాలని సూచించినట్లు సమాచారం. అయితే, ప్రొప్రయిటరీ యాప్లు మినహా ప్రభుత్వ లేదా థర్డ్ పార్టీ యాప్లను ఇలా ముందస్తుగా ఇన్స్టాల్ చేయడానికి యాపిల్ వ్యతిరేకం. ఈ విషయంలో ప్రభుత్వాల నుంచి వచ్చిన ఆదేశాలను తిరస్కరించిన సందర్భాలూ ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాబట్టి యాపిల్ నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశంపై ఇటు ప్రభుత్వం గానీ, ప్రధాన మొబైల్ తయారీ కంపెనీలైన యాపిల్, గూగుల్, శాంసంగ్ దీనిపై ఇంకా స్పందించలేదు.









