LIC పెట్టుబడుల్లో మా జోక్యం లేదు: నిర్మలా సీతారామన్ | Aadani Groups are Invested in LIC Company 2025

Aadani Groups are Invested in LIC Company

అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎస్ఐసీ (LC) పెట్టుబడుల విషయంలో తమ జోక్యం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) తెలిపారు. తమ శాఖ తరఫున ఎలాంటి సలహాలు గానీ, ఆదేశాలు గానీ ఇవ్వలేదని స్పష్టంచేశారు. పెట్టుబడుల
విషయంలో ప్రామాణిక నిర్వహణ ప్రక్రియను (SOP) అనుసరించి ఎల్ఎసీనే పెట్టుబడులపై నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు లోక్సభలో ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడుల విషయంలో ఎస్ఐసీకి ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయంటూ అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ అక్టోబర్ నెలలో ఓ కథనం వెలువరించింది. దీన్ని ఎస్ఐసీ తోసిపుచ్చింది. పెట్టుబడులు అనేవి తమ సొంత నిర్ణయమని పేర్కొంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ బదులిచ్చారు. ఎస్ఐసీ పెట్టుబడులపై సొంతంగా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఐఆర్డీఏఐ, ఆర్బీఐ, సెబీ నిబంధనలు అనుసరించి ఈ పెట్టుబడులపై ఈ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఎస్ఐసీ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టయిన టాప్-500 కంపెనీల్లో ఎస్ఐసీకి పెట్టుబడులు ఉన్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు.

వీటిలో పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్దమొత్తంలో పెట్టుబడులు ఉన్నాయని పేర్కొ న్నారు 2025 సెప్టెంబర్ 30 నాటికి నిఫ్టీ 50 కంపెనీల్లో ఎస్ఐసీ పెట్టుబుల విలువ రూ.4.30 లక్షల కోట్లు అని, మొత్తం పెట్టుబడుల్లో 45.85 శాతం వాటాకు సమానమని పేర్కొన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్లోలో రూ.40,901.38 కోట్లు, ఇన్ఫోసిస్లో రూ.38,846.33 కోట్లు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో రూ.31,926.89 కోట్లు, హెచ్ఎఎఫ్సీ బ్యాంక్లో రూ.31,664.69 కోట్లు, హిందుస్థాన్ యూనిలీవర్లో రూ.30,133 కోట్లు చొప్పున పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు. హెచ్ఎఎఫ్సీ బ్యాంక్కు అత్యధికంగా రూ.49,149.14 కోట్లు డెట్ రూపంలో ఇచ్చిందని పేర్కొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీసక్కు రూ.14,012.34 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.13,435 కోట్లు, శ్రీరామ్ ఫైనాన్స్ రూ. 11,075 కోట్లు, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్కు రూ.9625.77 కోట్లు చొప్పున రుణాల ఇచ్చిందని తెలిపారు.అదానీ గ్రూప్ కంపెనీల్లో అత్యధికంగా అదానీ టోటల్ గ్యాస్లో రూ.8,646.82 కోట్లు పెట్టుబడులు ఉన్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఎస్ఐసీఈ పెట్టుబడుల్లో ఈ కంపెనీ 25వ స్థానంలో ఉందన్నారు.

  • అదానీ ఎంటర్ప్రైజెస్లో రూ.8,470.60 కోట్లు (27వ స్థానం),
  • అంబుజా సిమెంట్స్ రూ.5,787.73 కోట్లు (40వ స్థానం),
  • ఏపీ సెజ్ రూ.5,681.10 కోట్లు (43వ స్థానం),
  • అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ రూ.3729.68 కోట్లు (65వ స్థానం),
  • అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 3,486.10 (71వ స్థానం),
  • ఏసీసీలో రూ.2,856.82 కోట్లు (81వ స్థానం) పెట్టుబడులు ఉన్నాయని పేర్కొన్నారు.
  • రూ.41 లక్షల కోట్ల మేర ఆస్తులతో దేశంలోనే అతిపెద్ద సంస్థాగత మదుపరిగా ఎస్ఐసీ ఉందని పేర్కొన్నారు. వివిధ కంపెనీల్లో రూ.15.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు.
  • ఎస్ఐసీ ప్రభుత్వ బాండ్లలోనూ, కార్పొరేట్ బాండ్లలోనూ పెట్టుబడులు పెడుతూ ఉంటుందని నిర్మలా సీతారామన్ వివరించారు.

Leave a Comment