వీరికి 99 శతం వరకు అధిక పింఛను ఇవ్వనున్న కేంద్రం| High Pensions under EPFO pensioners

High Pensions under EPFO pensioners

EPFO ద్వారా ఎక్కువ పింఛను కోసం వచ్చిన దరఖాస్తుల్లో 99 శాతం పరిష్కారమయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లాజే సోమవారం పార్లమెంటులో వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ ప్రక్రియను వేగవంతం చేశామని ఆమె తెలిపారు.

మొత్తం 17.49 లక్షల దరఖాస్తులు

అధిక పింఛను కోసం పెన్షనర్లు, సభ్యుల నుంచి మొత్తం 17.49 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 15.24 లక్షల అప్లికేషన్లను యజమానులు 2025 జనవరి 31 వరకు EPFOకు పదం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగానే ఇప్పటివరకు మొత్తం 4,27,308 మందికి డిమాండ్ లెటర్లు జారీ చేయడం జరిగింది . అయితే, ఆ తరువాత 34,060 కేసులు అనర్హమని తేలాయి.ముఖ్య కారణం, డిమాండ్ చేసిన మొత్తాన్ని జమ చేయకపోవడమే.

దరఖాస్తుదారుల్లో 2,33,303 మంది వారి సమ్మతిని తెలియజేశారు. వీరిలో 96,274 మంది ఉద్యోగాల్లో కొనసాగుతుండగా 1,37,029 మంది ఇప్పటికే పదవీ విరమణ చేశారు. రిటైర్ అయిన వారిలో 1,24,457 మందికి పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులు (PPO) ఇప్పటికే జారీ అయ్యాయి. మరో 12,572 PPOలు తుది దశలో ఉన్నాయని మంత్రి సభకు తెలిపారు.

ఏంటీ అధిక పింఛను అంశం..

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) నిర్వహించే ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) 1995 కింద పెన్షన్ లెక్కించడానికి, ఒక ఉద్యోగి వేతనాన్ని నెలకు రూ.15,000కు పరిమితం చేశారు. దీని అర్థం, ఎవరైనా ఉద్యోగి రూ.15,000 కంటే ఎక్కువ జీతం తీసుకున్నా, ఆ మొత్తంలో 8.33 శాతం (యజమాని వాటా) మాత్రమే పెన్షన్ ఫండ్కు జమ అవుతుంది. దీంతో, అధిక వేతనాలు పొందే వారికి కూడా తక్కువ పెన్షన్ వచ్చేది. ఈ పరిమితిని సవాలు చేస్తూ, ఉద్యోగులు తమ వాస్తవ వేతనం (Full salary) పై అంటే, పరిమితి లేకుండా మొత్తం జీతంపైపెన్షన్ ఫండ్కు అధికంగా వాటా చెల్లించడానికి, తద్వారా పదవీ విరమణ తర్వాత అధిక పింఛను పొందడానికి అనుమతించాలని ఉద్యోగులు కోరుకున్నారు. ఈ అంశమే వివాదానికి మూలమైంది.

సుప్రీంకోర్టు తీర్పుఈ వివాదంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, 2022 నవంబర్ 4న కీలక తీర్పు ఇచ్చింది. ఉద్యోగులు, వారి యజమానులు సంయుక్తంగా (Joint Option) దరఖాస్తు చేసుకుంటే అధిక వేతనంపై (రూ.15,000 పరిమితిని పరిగణలోకి తీసుకోకుండా) పెన్షన్ ఫండు వాటాలు చెల్లించడానికి అనుమతించాలనిసుప్రీంకోర్టు EPFOను ఆదేశించింది. ఈ తీర్పు ద్వారా, గతంలో పరిమితి వల్ల తక్కువ పింఛను పొందుతున్న లేదా పొందబోతున్న ఉద్యోగులకు, అధిక వేతనంపై పూర్తి వాటా చెల్లించే అవకాశం లభించింది. దీంతో తమ పదవీ విరమణ తర్వాత మెరుగైన పెన్షన్ పొందేందుకు వీలు కలిగింది.

Leave a Comment