Telangana Local Body Elections Schedule Releas
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. పంచాయతీల్లో ఓటరు జాబితాను మరోసారి సవరణ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయం తీసుకుంది. 20వ తేదీన ఓటర్ల దరఖాస్తు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ చేపట్టాలని ఈసీ ఉత్తర్వుల్లో తెలిపింది. 21న అభ్యంతరాల పరిష్కారం, 23న తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని పేర్కొంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని.. జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25న స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చెయాలి అని చూస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పంతో గతంలో మంత్రిమండలి తీర్మానం చేయడం, అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండటం, కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించడం, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన పరిణామాలను మంత్రివర్గం సమగ్రంగా చర్చించింది.అదే సమయంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించని పక్షంలో 15 వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావలసిన దాదాపు 3 వేల కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడుతుందని…
ఈ నేపథ్యంలో కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని మొదటగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది.ప్రభుత్వం తొలుత డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన వారోత్సవాలు’ నిర్వహించనుంది. ఈ వారోత్సవాల్లో కొత్త సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం.. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి ముఖ్యమైన పనులు ఉంటాయి. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే.. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.స్థానిక సంస్థల పాలకవర్గాలు లేకపోవడం వల్ల గ్రామాల్లో, మండలాల్లో అభివృద్ధి పనులు మందగిస్తున్నాయి. కాబట్టి.. తాజా కేబినెట్ నిర్ణయంతో డిసెంబర్ నెలలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో.. ప్రజలు, రాజకీయ పార్టీలు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.










