Vangaveeti Ranga Family Politics entry
విజయవాడలోని బందర్ రోడ్డులోగల వంగవీటి రంగా విగ్రహానికి ఆయన కుమార్తె ఆశా కిరణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలకొల్లులో వన భోజనాలకు వెళ్తున్నాను.
విజయవాడ/ MRR NEWS : ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంగవీటి రంగా ఫ్యామిలీ నుంచి మరొకరు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పాలిటిక్స్‌లోకి వస్తున్నట్లుగా రంగా కుమార్తె ఆశా కిరణ్ ప్రకటించారు.
విజయవాడలోని బందర్ రోడ్డులోగల వంగవీటి రంగా విగ్రహానికి ఆయన కుమార్తె ఆశా కిరణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలకొల్లులో వన భోజనాలకు వెళ్తున్నాను.. ప్రస్తుతానికి రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేయడం లేదని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చే విషయం, ప్రకటనపై మరోసారి మాట్లాడదామని అన్నారు.రాధా రంగా మిత్ర మండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటానని.. రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు. తన ఫ్యామిలీ బాధ్యతలు, ఇతర కారణాల వల్ల పబ్లిక్ లైఫ్‌కు కొంతకాలంగా దూరంగా ఉన్నా.. ఇకపై పూర్తిగా నా ప్రయాణం ప్రజలతోనే ఉంటుందని చెప్పారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని అన్నారు. రాధా రంగా మిత్ర మండలి మధ్య గ్యాప్ ఉంది.. ఆ గ్యాప్ ఫుల్ ఫిల్ చేయడానికి నేనే వస్తున్నా.










