Cm Chandrababu to particepate 3 lakh houses
సొంతింటికి వెళ్లిన లబ్ధిదారుల ఆనందంలో భాగమయ్యాను. ఆ క్షణాన వారి కళ్లలో కనిపించిన సంతోషం మాటల్లో చెప్పలేనిది.
రైతు ప్రస్థానం : సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి పేదవాడి కల. ఆ కలలకు రూపం ఇస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల కుటుంబాలతో గృహ ప్రవేశాలు చేశాయి. అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం, దేవగుడిపల్లెలో లబ్దిదారులైన హేమలత, ముంతాజ్ బేగం కుటుంబాల గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నాను.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-బీఎల్సీ కింద నిర్మించిన 2,28,034 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్లు, పీఎంఏవై జన్మన్ పథకం కింద మరో 6,866 ఇళ్లలో లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేయనున్నారు.
మొత్తంగా 3,00,192 ఇళ్లకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానం ద్వారా దాదాపు ఉచిత ఇసుక విధానంతో దాదాపు 20 టన్నుల ఇసుక ఉచితంగా పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది.సొంతింటికి వెళ్లిన లబ్ధిదారుల ఆనందంలో భాగమయ్యాను. ఆ క్షణాన వారి కళ్లలో కనిపించిన సంతోషం మాటల్లో చెప్పలేనిది. ప్రజావేదిక సభలో పాల్గొని పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించాను. ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు… ఒక కుటుంబానికి గౌరవం, సంతోషం, భవిష్యత్, భద్రత అని నమ్మి పాలన అందిస్తున్నాం. వచ్చే ఉగాదికి మరో 5.90 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోంది. ఇల్లు లేని పేదలను గుర్తించే ప్రక్రియ డిసెంబర్ 1వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను. 2029కి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం.










