Pan Card link With Aadhar card
కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు హోల్డర్లకి కొత్త నిబంధన అయితే విడుదల చేసింది ఈ నిబంధన ప్రకారం ప్రతి ఒక్క పాన్ కార్డు హోల్డర్ అయితే వెయ్యి రూపాయలు జరిమానా అయితే చెల్లించవలసి ఉంటుంది.
పాన్ కార్డు మనం ఆదాయానికి సంబంధించి ఎలాంటి ట్రాన్సాక్షన్ జరపాలి అన్న మనకు కచ్చితంగా పాన్ కార్డు అయితే ఉండాల్సి ఉంటుంది. పాన్ కార్డు ఉండడం వల్ల మనం ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో టాక్స్ రూపంలో అయితే కొంత మొత్తంలో అమౌంట్ ని చెల్లించవలసి ఉంటుంది. మనం జరుపుతున్న ట్రాన్సాక్షన్ లీగల్ అని తెలపడే పాన్ కార్డు యొక్క ముఖ్య లక్ష్యం. అయితే ఆదాయపు పన్ను చట్టం 1961లోని 139AA ప్రకారం ప్రతి ఒక్క పాన్ కార్డు వినియోగదారుడు కచ్చితంగా తమ యొక్క ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఆధార్ కార్డు లింక్ చేసుకోకుండా ఉంటారో వారిపై జరిమానా మరియు పాన్ కార్డు రద్దయ్య అవకాశం ఉంది.
ప్రతి ఒక్కరూ పాన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా లింక్ చేసుకోవాలని గడువును పదేపదే పెంచుతూ వచ్చింది అయినా కూడా చాలామంది పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోవడంతో ఇప్పుడు గడువు ముగియడంతో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుని పాన్ కార్డుతో లింక్ చేయాలి అంటే కచ్చితంగా 1000 రూపాయలు జరిమానా అయితే చెల్లించాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ ఆధార్ కార్డుతో లింక్ చేయడం వల్ల ఆదాయపు పన్ను జీఎస్టీ రిటర్న్స్ రిఫండ్ లాంటి ఎన్నో లావాదేవీలను జరపోవచ్చు ఒకవేళ ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే ఒకవేళ పాన్‌కార్డ్ రద్దయితే మీరు చట్ట ప్రకారం పాన్ కార్డు లేని వ్యక్తిగానే పరిగణించబడతారు.
ఫలితంగా మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయలేరు. మీకు రావాల్సిన పన్ను రిఫండ్లు నిలిచిపోతాయి. మీ జీతం, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ, ఇతర ఆదాయాలపై అధిక రేటుతో టీడీఎస్ కట్ అవుతుంది.రూ.50,000 మించిన బ్యాంకింగ్ లావాదేవీలు జరపడం కష్టమవుతుంది. కొత్తగా డీమ్యాట్ ఖాతా తెరవలేరు. ఆస్తుల క్రయవిక్రయాల్లో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాహనాలు కొనడం లేదా అమ్మడం వంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలు నిలిచిపోతాయి.అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంకా ఛాన్స్ ఉంది. రూ.1000 జరిమానా చెల్లించి, పాన్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనలను తేలికగా తీసుకోకుండా, వెంటనే మీ పాన్-ఆధార్ లింకింగ్ స్టేటస్‌ను చెక్ చేసుకోండి. ఒకవేళ లింక్ చేయకపోతే, వెంటనే చేయటం మంచిది.
Link your Pan Card with Aadhar










