పత్తి రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు | Tummala Request to CCI to buy wet cotton 2025

Tummala Request to CCI to buy wet cotton

పత్తి రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ . అకాల వర్షాల కారణంగా పత్తి తడిసి ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పత్తి రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ . అకాల వర్షాల కారణంగా పత్తి తడిసి ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో వివిధ పంటల కొనుగోళ్లపై ఉన్నతాధికారులు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులతో సమీక్ష నిర్వహించారు. పత్తి కొనుగోళ్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు..

సాధారణంగా పత్తిలో తేమ శాతం 8-12 శాతం వరకు ఉండాలనే నిబంధనను సడలించాలని సీసీఐ అధికారులకు ఆయన సూచించారు. వర్షాల కారణంగా తడిసిన పత్తిని రైతులు ఆరబెడుతున్నా తేమ శాతం మాత్రం తగ్గడం లేదని దీని వాళ్ళ రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఇకపై 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్నా కూడా మద్దతు ధరలతో కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. రైతులు దళారుల వద్దకు వెళ్లి మోసపోకుండా, సీసీఐ కొనుగోలు కేంద్రాలలోనే పత్తి అమ్మకాలు జరిగేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.

పత్తిలో తేమ శాతంపై, కొనుగోలు ప్రక్రియలో ఉన్న ‘ఎల్1, ఎల్2 మ్యాపింగ్’ విధానంపైనా రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలి అని అన్నారు. ఈ-నామ్ (e-NAM) సర్వర్‌లో ఏర్పడుతున్న సమస్యతో కొన్ని జిల్లాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.


Follow On:-

Leave a Comment