Land Map Is Mandatory in Bhubharathi Act
రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన
కొత్త లైసెన్స్డ్ సర్వేయర్లకు త్వరలో లాగిన్లు తగ్గనున్న సర్వే టైం
పెరిగిన సర్వే ఫీజులు
గతంలో అడుగు జాగా కోసం కొట్టుకోవడం సంపుకోడం జరిగేవి ఇప్పుడు ఆ సమస్య లేకుండా భూమి సర్వే, రిజిస్ట్రేషన్ ప్రక్రియల్లో నెలకొన్న జాప్యం, గెట్ల పంచాయితీలకు శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇకపై ‘భూ భారతి’ చట్టం ప్రకారం వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయాలంటే సర్వే మ్యాప్ తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని పకడ్బందీగా అమలు చేసే దిద్దగా పని చేస్తుంది.ఈ వ్యవస్థను అమల్లోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను సిద్ధం చేస్తున్నది. ఇకపై సర్వే కోసం దరఖాస్తు చేసుకోవడం, ఫీజు చెల్లించడంలాంటి పనులన్నీ ఆన్లైన్లోనే జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.దీని కోసం అని కొత్తగా నియమించిన లైసెన్స్ సర్వేయర్లకు త్వరలో లాగిన్లను అందజేయనున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే, సర్వే కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పని ఉండదు. ఈ కొత్త విధానానికి సంబంధించిన త్వరలో నోటిఫికేషన్ తేదీని రేవంత్ సర్కార్ ప్రకటించనున్నది.
గెట్ల పంచాయితీలకు ఇక చెక్
భూమి సర్వేను సులువు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్సైట్ను రూపొందిస్తున్నది.దీని ద్వారా రైతులు తమ భూమి సర్వే కోసం దరఖాస్తులు, అవసరమైన ఫీజుల చెల్లింపులు ఈ ఆన్లైన్ పోర్టల్లోనే పూర్తి చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం ఉండదు. దరఖాస్తు స్టేటస్ ను కూడా ఆన్లైన్లోనే తెలుసుకోవచ్చు. లైసెన్స్ డ్ సర్వేయర్లకు ప్రత్యేకంగా లాగిన్లను కూడా ఇవ్వనుంది. సర్వేకు వసూలు చేసే మొత్తాన్ని లైసెన్స్ డ్ సర్వేయర్ల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం విడతలవారీగా జమ చేయనున్నది.
ప్రతి మండలానికి 46 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు
గతంలో భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల రెండు నుంచి మూడు నెలల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది కొన్ని కొన్ని సార్లు ఐతే వాళ్ళు రాకుండా చాల సార్లు అప్లికేషన్ చేయాల్సి వచ్చేది. ఇపుడు ప్రతి మండలానికి 4-6 మంది లైసెన్స్ ఉన్న సర్వే యర్లు అందుబాటులో ఉండనున్నారు. ఇంకా మరికొంత మందికి శిక్షణ కొనసాగుతున్నది. పరీక్ష పాస్ అయితే మరో 3 వేల మంది డిసెంబర్ లో అందుబాటులోకి వస్తారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ కొత్త విధానం లో సర్వే మ్యాప్ అందించడానికి అయ్యే ఆలస్యాన్ని తగ్గించేలా ప్రభుత్వం చర్య లు చేపట్టింది.
పెరిగిన ఫీజులు ఎంత
- భూమి సర్వే చేయడానికి అయ్యే ఫీజులను కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది.
- రెండెకరాలలోపు విస్తీర్ణానికి సర్వే చేసి, మ్యాప్ అందించడానికి రూ.1000 ఫీజు వసూలు చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
- ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూములకు ఎకరా ప్రాతిపదికన లేదా స్లాబులవారీగా ఫీజులు ఉండే అవకాశం ఉన్నది.
- 2-5 ఎకరాల వరకు 2 వేలు
- 5-10 ఎకరాల వరకు5 వేలు
- విస్తీర్ణం 10 ఎకరాలు మించితే 5 వేలకు అదనంగా ప్రతి ఎకరాకు రూ.500 చొప్పున ఫీజు ప్రపోజల్స్ ఉన్నాయి.
- ఈ ఫీజుల వివరాలతోసహా పూర్తి నోటిఫికేషన్ తేదీని ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్నది.
- ఈ మార్పులన్నీ అమల్లోకి వస్తే, భూమి రికార్డుల్లో పారదర్శకత పెరిగి, సరిహద్దుల వివాదాలు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం భావిస్తున్నది.
కొత్త సర్వేయర్లతో పనులు స్పీడప్
రాష్ట్రంలోప్రధానంగా వ్యవసాయ భూములకు సంబంధించి సర్వే నంబర్లు, బై నంబర్లు, సరిహద్దులు, ఫీల్డ్లో సాగు విస్తీర్ణం లాంటి వాటితోనే అధిక భూ సమస్యలు ముడిపడి ఉన్నాయి. భూమికి సంబంధించిన వివాదాలకు సరైన సర్వే మ్యాప్ లేకపోవడం మూలకారణంగా రేవంత్ ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ‘భూ భారతి’ చట్టంలో భూముల రిజిస్ట్రేషన్ కావాలంటే తప్పనిసరిగా సర్వే మ్యాప్ జతచేయాలనే నిబంధన తెచ్చింది.దీంతో సర్వేయర్ల అవసరం ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వంలోని సర్వే డిపార్ట్మెంట్ లో 612 మండలాలకు కేవలం 350 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. ఈ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఇటీవలే 3,456 కొత్త లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించింది. వీరికి ఇప్పటికే నియామక పత్రాలను అందజేసింది.
Follow On:-
- Arattai Channel: Click Here
- Whats app Channel: Click Here
- Telegram Channel: Click Here










You’ve sparked my interest in this topic.