Telangana Land Surveyar Fee Details 2025
తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇకపై వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్‌ను జతచేయడం తప్పనిసరి కానుంది. భూముల సర్వేను పూర్తి చేసి మ్యాపులు అందించేందుకు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం ద్వారా భూముల రిజిస్ట్రేషన్‌లో పారదర్శకత పెరగడమే కాకుండా, రైతులకు సేవలు మరింత వేగంగా అందే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.ఇప్పటికే లైసెన్స్డ్ సర్వేయర్లకు నియామక పత్రాలను అందించింది. అంతే కాకుండా సర్వే చేసే వారికి ఇవ్వవలసిన ఫీజు పను కూడా ఖరార్ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ మరియు మున్సిపల్ ప్రాంతాల్లో ఎదురవుతున్న భూ సమస్యలను పరిష్కరించడం కోసం ప్రతి హద్దును నిర్ణయించి భూ సమస్యలను పరిష్కరించి యజమానులకు పట్టాలు అందించాలి అని ప్రభుత్వం కొత్తగా లైసెన్స్డ్ సర్వేలను నియమించుకున్నారు.అలాగే ప్రతి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కు లాండ్ మ్యాప్ లను కంపల్సరీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.ఈ కొత్త విధానం ద్వారా భూముల రిజిస్ట్రేషన్‌లో పారదర్శకత పెరగడమే కాకుండా, రైతులకు సేవలు మరింత వేగంగా అందే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల ప్రకారం, రెండెకరాల లోపు భూముల సర్వేకు రూ. 1,000 ఫీజు వసూలు చేయనున్నారు. ఈ మొత్తంలో ప్రభుత్వం 5 శాతం మినహాయించుకుని, మిగతా 95 శాతం సర్వేయర్లకు అందజేయనుంది. ప్రస్తుతం మండల సర్వేయర్ ద్వారా నాలుగు సర్వే నంబర్ల వరకు సర్వే చేయించుకోవాలంటే రూ. 275 ఫీజు వసూలు చేస్తున్నారు. అయితే, ఈ విధానం క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని ప్రభుత్వం గుర్తించింది. దీంతో నూతనంగా లైసెన్స్డ్ సర్వేయర్ల విధానాన్ని ప్రవేశపెట్టింది.
ప్రతీ మండలంలో భూ విస్తీర్ణాన్ని బట్టి నలుగురు నుంచి ఆరుగురు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నారు. వీరికి ఇప్పటికే లైసెన్స్ పత్రాలు ఇవ్వబడ్డాయి. త్వరలో ఈ విధానానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన వెంటనే “భూభారతి చట్టం” ప్రకారం సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు సర్వే పటం జతచేయడం తప్పనిసరి అవుతుంది.సర్వే ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక యాప్ లేదా వెబ్‌సైట్‌ను రూపొందిస్తోంది. భూమి యజమానులు ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా చలానా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన వెంటనే వివరాలు ఆయా లైసెన్స్డ్ సర్వేయర్‌కు చేరుతాయి.
సర్వేయర్లు భూమి పరిశీలన పూర్తి చేసిన వెంటనే ప్రభుత్వం వారికి మూడు విడతలుగా చెల్లింపులు చేస్తుంది.
- మొదటి విడత: సర్వే వివరాలు నమోదు చేసిన వెంటనే 30% ఫీజు.
- రెండవ విడత: రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మరో 30%.
- మూడవ విడత: అధికారుల పరిశీలన అనంతరం మిగిలిన 35%.భూమి సర్వే ఫీజు కూడా భూమి విస్తీర్ణాన్ని బట్టి నిర్ణయించారు.
- రెండు ఎకరాల వరకు రూ.1,000,
- 2–5 ఎకరాల వరకు రూ.2,000,
- 5–10 ఎకరాల వరకు రూ.5,000,
- 10 ఎకరాలకు పైగా ఉంటే ప్రతి అదనపు ఎకరానికి రూ.500 చొప్పున ఫీజు వసూలు చేయనున్నారు.
ఈ కొత్త విధానం ద్వారా భూముల సర్వే, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు వేగవంతం అవుతాయని, ల్యాండ్ రికార్డుల్లో పారదర్శకత పెరిగి వివాదాలు తగ్గుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇది రైతులకు సమయపాలనతో కూడిన, నమ్మకమైన సేవలు అందించడంలో కీలక అడుగుగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.
Follow On:-
- Arattai Channel: Click Here
- Whats app Channel: Click Here
- Telegram Channel: Click Here










