రైతులకు గుడ్ మరో రెండు పథకాలను అందుబాటులోకి | Pradhan Mantri 2 New Schemes For Farmers

Pradhan Mantri 2 New Schemes For Farmers

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్ధికసహాయం అందించడం మరియు పెట్టుబడి కొత్త ఐడియాలను సృష్టించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉన్నాయి.మల్లి రోజునుడి 2 కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకురానున్నాయి.అవేంటి పథకాల గురించి వీడియోలో తెల్సుకుందాం..

రైతులకు మరో పెద్ద శుభవార్త చెప్పారు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 11న ఢిల్లీలోని పూసా ప్రాంతంలో నిర్వహించనున్న కార్యక్రమంలో రెండు కొత్త పథకాలనుప్రారంభించారు. అవి ‘దళహన్ ఆత్మనిర్భరత మిషన్’మరియు ‘ప్రధానమంత్రి ధన్-ధాన్య వ్యవసాయ యోజన’ , . ఈ రెండు పథకాలు రైతుల ఆదాయం పెంపు, ఉత్పాదకత అభివృద్ధికి దోహదం చేయనున్నాయని మంత్రి వివరించారు.

దళహన్ మిషన్ – కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకారం.. దేశం పప్పుధాన్య ఉత్పత్తిలో పెద్దదే అయినప్పటికీ, ఇంకా దేశ ప్రజలు దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో పప్పుధాన్య ఉత్పత్తి 242 లక్షల టన్నులుగా ఉండగా, దీన్ని 350 లక్షల టన్నులకు పెంచడమే లక్ష్యమని వివరించారు.దళహన్ పథకం పంటలకు కీటక నిరోధకత, అధిక ఉత్పాదకత, వాతావరణ అనుకూలత కలిగిన విత్తనాలు అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టామని చౌహన్ అన్నారు. రైతులకు 126 లక్షల క్వింటాళ్ల ధృవీకృత విత్తనాలు పంపిణీ చేసి, 88 లక్షల ఉచిత విత్తన కిట్లు అందించనున్నట్లు తెలిపారు.దళహన్ పంటలు సాగు చేసే ప్రాంతాల్లోనే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభిస్తాయని అన్నారు. ఇందుకోసం దాదాపు 1,000 ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి, ప్రతి యూనిట్‌కు ₹25 లక్షల సబ్సిడీ ఇవ్వనున్నారు.వ్యవసాయ మౌలిక సదుపాయాల ఫండ్, మత్స్యరంగం, పశుసంవర్థక,ఆహార ప్రాసెసింగ్ రంగాల ప్రాజెక్టుల ప్రారంభం, శిలాన్యాసం కూడా జరుగనుంది.

ధన్-ధాన్య యోజన దేశంలో ప్రతి ప్రాంతంలో పంటల ఉత్పాదకత ఒకేలా లేదని తక్కువ ఉత్పాదకత గల జిల్లాలను గుర్తించి, వాటిలో ఉత్పాదకత పెంచే ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రణాళిక కింద నీటి పారుదల,రుణ సౌకర్యాలు, భండారాలు, పంటల వైవిధ్యీకరణ వంటి అంశాలపై దృష్టి సారించబడుతుంది. ప్రారంభ దశలో 100 జిల్లాలను ఎంపిక చేశామని ఆయన తెలిపారు.

ఈ రెండు పథకాలు రైతుల ఉత్పాదకత పెంపు, ఆదాయం వృద్ధి, ఆత్మనిర్భరత సాధనకు కీలకమవుతాయని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి “ఒక దేశం – ఒక వ్యవసాయం – ఒక జట్టు” సూత్రం కింద పనిచేయనున్నాయని తెలిపారు. మొత్తం మీద, రైతుల భవిష్యత్తును మెరుగుపరచడం, దేశాన్ని ఆహార స్వావలంబన దిశగా తీసుకెళ్లడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త కార్యక్రమాలను ప్రారంభించనుంది.


Follow On

Arattai Channel: Click Here
Whats app Channel: Click Here
Telegram Channel: Click Here


Leave a Comment