Local body Elections High Court Big Update
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మల్లి ఎలేచ్షన్స్ ను తెరపైకి తెచ్చింది.తెలంగాణాలో జరగనున్న స్థానిక ఎన్నికలపై మరో అప్డేట్ ఇచ్చిన హై కోర్ట్
ఎన్నికల కోసం పల్లెలు ఏడాదిగా ఎదురుచూస్తుంటే అనేక గందరగోళాలు, వివాదాల అనంతరం ఎట్టకేలకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లను ఇవ్వడాన్ని సవాల్ చేయడంపై హైకోర్టు రెండ్రోజులు విచారించి తాజాగా స్టే ఇచ్చింది. దీంతో ఈ ఉదయం గం. 10:30కి వచ్చిన తొలి ఫేజ్ నోటిఫికేషన్ సాయంత్రం గం.4కు అర్థరహితంగా మారిపోయింది.
రేవంత్ సర్కార్ ఇప్పుడు స్థానిక ఎన్నికలపైనా ఎటు తేల్చలేక తర్జన భర్జన పడుతుంది.ఎన్నికలు నెల పాటు నిర్వహించకుండా ఆపాలన్న హై కోర్ట్ ఇప్పుడు నిర్వహించండి అంటూ తెలిపింది.స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే జీవోపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై 2 రోజులు వాదనలు విన్న HC, జీవోతో పాటు ఎన్నికల నోటిఫికేషన్పైనా స్టే ఇచ్చింది. ప్రభుత్వం, పిటిషనర్ దీనిపై మరిన్ని వివరాలతో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
దీంతో నెల పాటు ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడ్డట్లైంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు గురువారం స్టే విధించగా ఆ ఉత్తర్వుల పూర్తి వివరాలు అర్ధరాత్రి అందుబాటులో వచ్చాయి. గడువు తీరిన స్థానిక సంస్థలకు పాత విధానం ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కోర్టు తెలిపింది. పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని పేర్కొంది. దీంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తదుపరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది