Mahesh babu and rajamouli movie title fix
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ హీరోలను తలదన్నే హ్యాండ్సమ్ లుక్ తో ఉండే మహేష్.. RRR మూవీతో గ్లోబల్ స్థాయిలో ప్రశంసలు అందుకున్న రాజమౌళి కలిసి బిగ్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలనే ఎగ్జైట్మెంట్ అందరిలో ఉంది.
అందుకే ఈ గ్లోబ్ ట్రాటర్ మూవీకి సంబంధించి ఎటువంటి చిన్న న్యూస్ వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతుంది. ఇప్పుడు లేటెస్టుగా సినిమా టైటిల్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.మహేష్ బాబు ఇమేజ్ కి సరిపడేలా పవర్ఫుల్ గా.. గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే విధంగా క్యాచీగా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. కానీ సోషల్ మీడియా, టాలీవుడ్ సర్కిల్స్ లో మాత్రం ఈ సినిమాకి ‘వారణాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
జక్కన్న ఎన్టీఆర్ – చరణ్ తో కలిసి తీసిన “ఆర్ఆర్ఆర్” లానే ఈ చిత్రానికి కూడా క్యాచీగా టైటిల్ ఉంటుందని అందరూ భావిస్తున్న తరుణంలో.. ఈ సింపుల్ టైటిల్ ను ఫిక్స్ చేయడమేంటి? అని చర్చించుకుంటున్నారు. రీసెంట్ గానే మహేష్ బాబు పుట్టిన రోజూ సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. నవంబర్ లో మూవీ టైటిల్, పోస్టర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
దాంతో మూవీ టైటిల్ విషయంలో సస్పెన్స్ కి తెర పడాలంటే నవంబర్ 16 వరకు వేచి చూడాల్సిందేనని అంటున్నారు. మహేష్ బాబు లుక్ అండ్ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కోసం జక్కన్న పెద్ద ప్లానే వేశారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మహేశ్, ప్రియాంక షూట్ పూర్తయిందని.. VFX వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.