అసైన్డ్ భూముల పరిరక్షణకు రోబోలతో సర్వే | Assigned lands enjyoment survey with robots 2025

Assigned lands enjyoment survey with robots

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసైన్డ్ భూములకు ఏంజ్యోమెంట్ సర్వే చేయాలి అందేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే దీని ద్వారా అసైన్డ్ భూములను గుర్తించి అర్హులు ఐన వారికి పట్టాలను అందించాలి అని ఆలోచన చేస్తుంది.

ఐతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూముల సర్వే పై కొత్త విషాణం అమలు చేయనుంది.ఎప్పుడైనా సరే భూములు సర్వే చేయాలి అంటే మానుల్ గా ప్రభుత్వ సర్వేయర్లు భూమి దగ్గరకు వెళ్లి అక్కడ హద్దులు నిర్ణయించి సర్వే చేసి రిపోర్టును సంబంధిత మండల mro కి లేదా dd కి అందించి భూములను డిజిటలైజ్ చేసే వారు కానీ ఇప్పుడు రోబోలతో సర్వే నిర్వహించి దాని ద్వారా భూములను డిజిటలీస్ చేయనున్నారు.

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూముల పరిరక్షణకు రోబోలతో సర్వే నిర్వహించనున్నారు.ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ భూముల వివరాలన్ని ఇప్పటికే ఆన్లైన్లో పొందుపరిచారు.రెండు జిల్లాల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూములను జీఐఎస్ ద్వారా గుర్తించి జియో ట్యాగింగ్ను చేయించనున్నారు.కచ్చితత్వం… అత్యంతవేగం.. మండలాల వారీగా ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాలను సేకరించిన అనంతరం సర్వేకు రోబోలను తీసుకెళ్లనున్నారు.

అత్యంతవేగంగా అవి సర్వే చేసి ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తాయి. ప్రభుత్వ ఖాళీ స్థలాలను ఎవరైనా కబ్జా చేశారా? వాటిపై కోర్టుల్లో న్యాయ వివాదాలున్నాయా? వంటి అంశాలను ప్రత్యేకంగా యాప్లోనే విడిగా వివరాలను రోబోలే అప్లోడ్ చేయనున్నాయి. వాటిని డిజిటల్ పద్దతిలోకి మార్చాక జిల్లా మొత్తానికీ ఒక మ్యాప్ను రూపొందించనున్నారు. రోబోలతో సర్వే.. జీఐఎస్ విధానంపై ప్రతివారం ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని మేడ్చల్ జిల్లా అదన కలెక్టర్ విజయేందర్రెడ్డి తెలిపారు.

Leave a Comment