Coldrif Syrup Company Siege : కోల్డ్రిఫ్ సిరప్ కంపెనీ సీజ్ ఓనర్ రంగనాథన్ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ 2025

Coldrif Syrup Company Siege

అభం శుభం తెలియని పిల్లల అనారోగ్యాలను హరిస్తున్న కంపెనీలు.దగ్గు సిరప్తో MP, రాజస్థాన్లో 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో నలుగురు మరణించడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. రా మెటీరియల్స్, ఫైనల్ ప్రొడక్ట్స్ అన్నీ క్షుణ్నంగా టెస్ట్ చేయాలంది.

4 ఏళ్లలోపు పిల్లలకు కోల్డ్, కాఫ్ సిరప్లు ఇవ్వొద్దని చెప్పినా విక్రయాలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్య ప్రదేశ్లో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ (ప్రమాదకర కెమికల్ ‘డైథిలిన్ గ్లైకోల్’ కలిసిన సిరప్) మరణాల సంఖ్య 20కి చేరినట్లు Dy.CM రాజేంద్ర శుక్లా వెల్లడించారు. నాగ్పూర్లో ఆస్పత్రులను ఆయన సందర్శించారు.కలుషిత సిరప్ తాగి మరో ఐదుగురి కిడ్నీలు పాడైపోయాయని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

మృతుల్లో చింద్వారాకు చెందిన వారే 17మంది ఉన్నారని చెప్పారు.ఆరేళ్ల దివ్యాంక్ ఒకడు. జ్వరం రావడంతో తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్ సూచనతో కోల్డిఫ్ సిరప్ రోజుకు 4 సార్లు తాగించగా ఆరోగ్యం క్షీణించి చనిపోయాడు. మృతుల లిస్టులో అతడి పేరు చేర్చకపోవడంతో రూ.4 లక్షల పరిహారమూ అందలేదు. ఫీవర్, జలుబు ఉన్న పిల్లలు సిరప్ తాగడంతో వాంతులు, మూత్ర విసర్జన సమస్యలు వంటి లక్షణాలు కనిపించాయన్నారు..సెప్టెంబర్ 19నే మరణాలు నమోదైనా సర్కార్ నిర్లక్ష్యం వహించింది.

29న సిరప్ శాంపిళ్లను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఛింద్వాడా నుంచి భోపాల్ (300 కి.మీ)కు పంపారు. గంటల్లో వెళ్లాల్సిన శాంపిల్స్ 3 రోజులకు అక్కడికి చేరాయి. రిపోర్ట్ రాకముందే అక్టోబర్ 1, 3 తేదీల్లో ఆ సిరప్ సేఫ్ అని ఆరోగ్య శాఖ మంత్రి ప్రక.టించడం గమనార్హం.దగ్గు మందు అంటేనే భయపడేలా కోల్డిఫ్ కాఫ్ సిరప్ తయారు చేసిన శ్రేసన్ కంపెనీ(తమిళనాడు) ఓనర్ రంగనాథన్ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారుల మరణాలతో ఈ నెల 1, 2 తేదీల్లో అధికారులు చేసిన తనిఖీల్లో గ్యాస్ స్టవ్లపై రసాయనాలు వేడి చేయడం, తుప్పు పట్టిన పరికరాలు గుర్తించారు. అనుభవం లేని సిబ్బంది, బ్లౌజులు, మాస్కులు లేకుండా పనిచేస్తున్నట్లు గమనించారు. అనంతరం కంపెనీని సీజ్ చేశారు.

Leave a Comment