షెడ్యూల్ ప్రకారం రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ | Notification of local body elections tomorrow 2025

Notification of local body elections tomorrow

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం రేపు (అక్టోబర్ 09) స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై సుధీర్ఘ వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. దీనిపై పిటిషనర్ల తరపు లాయర్లు రేపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకుండా చూడాలని కోరగా హైకోర్టు పట్టించుకోలేదు. దీంతో రేపు యథావిధిగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.

మొదటి విడత జెడ్ పి టి ,ఎం పి టి సి ఎన్నికల నామినేషన్ల ను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా తీసుకోవాలని జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్ లాల్ పవర్ అన్నారు.బుధవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ విసి హాల్ నుండి జిల్లాలోని ఆర్డీఓ లు, తహసీల్దార్ లు, పోలీస్ సిబ్బంది,ఎంపిడిఓ లు, ఆర్వో లతో జడ్పీటీసి, ఎంపిటిసి ఎన్నికల, నామినేషన్ ప్రక్రియలపై వీడియో కాన్ఫి రెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రేపు (9.10.2025)సూర్యాపేట డివిజన్ పరిధిలోని 11 జడ్పీటీసీ, 112 ఎంపిటిసి స్థానాలకు చెందిన ఆర్వో లు రేపు ఉదయం 8:00 గంటలకే ఆర్వో కార్యాలయాలకు చేరుకొని ఆర్వో కేంద్రాలనుండి 100 మీటర్ల దూరం మార్కింగ్ చేయాలని,10 :00 గంటలకు ఎన్నికల నోటీసు జారీ చేసి నోటీసు బోర్డు లో ప్రదర్శించాలని సూచించారు.జడ్పీటీసీ, ఎంపీటీసీ లకు సంబంధించిన ఆర్వోలు ప్రాదేశిక నియోజకవర్గాలు తెలిపేలా ఫ్లెక్సీ లను ఏర్పాటు చేసుకోవాలని, నామినేషన్ లకు సంబందించిన మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలని, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు.

నామినేషన్ వేసేటప్పుడు అభ్యర్థి తో కలిపి ముగ్గురు కి మాత్రమే ఆర్వో ఛాంబర్ లోకి అనుమతి ఉంటుందని అలాగే ఒక్క వాహనం కి అనుమతి ఉందని తెలిపారు.ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు అభ్యర్థులనుండి నామినేషన్ పత్రాలు స్వీకరించాలని అన్నారు.ప్రతి రోజూ నామినేషన్ లకు సంబందించిన వివరాలు తెలియజేయాలనీ తెలిపారు.నామినేషన్ ప్రక్రియలో ఏలాంటి తప్పులకు ఆష్కారం లేకుండా అందరు సమన్వయము చేసుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు.అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద పటిష్టంగా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ప్రతి వాహనం తనిఖీ చేయాలని సూచించారు.

జిల్లా ఎస్పి కే నరసింహ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో సమస్యత్మాక ప్రాంతాలను గుర్తించామని, అన్ని ఆర్వో కార్యాలయాల వద్ద బందోబస్త్ ఏర్పాటు చేస్తామని, అంతరాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తామని,జిల్లాలో ఎన్నికలు సవ్యంగా జరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.అదనపు కలెక్టర్ కే సీతారామారావు, జడ్పీ సిఈ ఓ వివి అప్పారావు, డిపి యాదగిరి, జడ్పీ డిప్యుటీ సీఈఓ శిరీష, డి ఎల్ పి ఓ నారాయణ రెడ్డి, అధికారులు, తదితరులు ఈ వీడియో కాన్ఫి రెన్స్ కి హాజరయ్యారు.

Leave a Comment