The attack on Justice BR Gavai is a hoax
జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడి అనుమనుషం
ఇది సాక్షాతూ భారత రాజ్యాంగంపై దాడి
షాద్ నగర్ దళిత యువనేత జాంగారి రవి
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి. ఆర్. గవాయ్ గారిపై సుప్రీం కోర్టులో జరిగిన దాడి ఆందోళన కలిగించే, తీవ్రంగా ఖండించవలసిన సంఘటన అని షాద్ నగర్ దళిత యువ నేత జాంగారి రవి అన్నారు. న్యాయవ్యవస్థను ప్రతిబింబించే వస్త్రధారణలో ఉన్న న్యాయవాది, కోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై చెప్పు విసరడం అనేది కేవలం వ్యక్తిపై దాడి కాదు ఇది న్యాయవ్యవస్థ గౌరవం, రాజ్యాంగ పరమాధికారం, ప్రజలకు న్యాయంపై ఉన్న నమ్మకంపై దెబ్బ అని జాంగారి రవి అన్నారు.
ఇది ఒక్కసారిగా జరిగిన సంఘటన కాదు గవాయ్ గారు షెడ్యూల్డ్ కులానికి చెందినవారు, ఈ అత్యున్నత పదవిని చేపట్టిన రెండవ దళిత వ్యక్తి ఈ నేపథ్యంలో ఈ దాడి వెనుక కుల ఆధారిత ద్వేషం ఉండొచ్చని విషయాన్ని విస్మరించలేం ఒక న్యాయమూర్తి అది దేశ ప్రధాన న్యాయమూర్తి కోర్టు రూమ్ లోనే ఇలాంటి అవమానం ఎదుర్కొనడం, రాజ్యాంగ విలువలను మత, కుల విద్వేషాలు చెరిపేసే ప్రమాదకర ధోరణిని సూచిస్తుంది అని తెలిపారు.ఒక న్యాయవాది తన మతభావాలకు రాజ్యాంగం, న్యాయవ్యవస్థ కంటే ఎక్కువ విలువ ఇవ్వడం అత్యంత ప్రమాదకరం.
రాజ్యాంగం ప్రకారం ఎవరి విశ్వాసం, మతం లేదా భావోద్వేగం కూడా చట్టం కన్నా ఎక్కువ కాదు,మతపరమైన సిద్ధాంతాలకి ఎక్కువ విలువ ఉన్నచోట లౌకికత్వం, న్యాయస్వాతంత్ర్యం రెండూ ప్రమాదంలో పడతాయి అని అన్నారు.ఈ ఘటనపై తక్షణ కఠిన చర్యలు అవసరం. SC-ST చట్టం, కోర్టు ధిక్కార చట్టం ప్రకారం దర్యాప్తు, భద్రతా లోపాలపై విచారణ, వృత్తినిషేధం వరకు చర్యలు తీసుకోవాలి.