42% రిజర్వేషన్ ను నిరసిస్తూ వేసిన కేసును సుప్రీం కోర్ట్ తొలగింపు | Suprim Court Dismissed 42% Reservation Case

Suprim Court Dismissed 42% Reservation Case

రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికల జోరు నడుస్తుంది ఎక్కడ చూసిన కూడా ఎలక్షన్ జోరు మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగబోయే ఎన్నికలపై అందరి చూపు ఉంది.

రైతు ప్రస్థానం డెస్క్:  రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది 42 % రిజర్వేషన్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన బీసీ 42% రిజర్వేషన్ కారణంగా జీవో నెంబర్ 9 ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.ఐతే జీవో అమలు కాక ముందే మాధవ రెడ్డి అనే వ్యక్తి జీవో ను ఎలా ప్రవేశ పెడుతారు అంటూ హై కోర్ట్ లో కేసు వేయగా పరిశీలించిన కోర్ట్ అక్టోబర్ 8 వరకు ఎలేచ్షన్స్ విరమించాలి అని తెలిపింది.

ఐతే దీనిని నిరసిస్తూ దేశ ప్రధాన న్యాయస్థానం ఐన సుప్రీం కోర్టులో వంగ గోపాల్ రెడ్డి కేసు వేయగా అక్కడ కేసు ఆల్రెడీ హై కోర్టులో నాడు స్తూ ఉండాగానే ఇక్కడ కేసు ఎలా వేస్తారు అంటూ చివాట్లు పెట్టి కేసును డిస్మిస్ చేసింది.దీంతో రాష్ట్ర మంత్రులకు కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లు అయింది.కేంద్రం అప్రూవల్ ఇస్తే మేము ఇలా కోర్ట్ చుట్టూ తిరగాల్సిన పని ఉండేది కాదు అని తెలంగాణ రవాణా శాఖ మంత్రో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఇప్పటికే ఈసీ స్థానిక ఎన్నికలకు సంబంధించి అర్హతలు మరియు ఎన్నికల షెడ్యూల్ ను ఇప్పటికే విడుదల చేసింది.42% రిజర్వేషన్ కు సంబంధించి 8 తారీఖున సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

Leave a Comment