Police register case against heroine Dimple
హీరోయిన్ డింపుల్ హయతి మరో వివాదంలో చిక్కుకున్నారు. వారి ఇంట్లో పనిచేస్తున్న యువతి ఫిర్యాదు మేరకు డింపుల్ హయతి, ఆమె భర్త డేవిడ్‌పై ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపులు, దాడికి సంబంధించిన ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఒడిశాలోని రాయగడ జిల్లాకు చెందిన 22 ఏళ్ల ప్రియాంక బిబార్ హైదరాబాద్‌లో ఉపాధి కోసం వచ్చింది .
శ్రీ సాయి గుడ్‌విల్ సర్వీస్ ద్వారా ఆమె ఉద్యోగం కోసం ప్రత్నిస్తున్న క్రమంలోనే సెప్టెంబర్ 22న హైదరాబాద్‌కు వచ్చిన ప్రియాంక అదే రోజు షేక్‌పేటలోని వంశీరామ్ వెస్ట్‌వుడ్ అపార్ట్‌మెంట్‌లోని నటి డింపుల్ హయాతి నివాసంలో పనిమనిషిగా చేరారు.ఆమె పని చేస్తున్న క్రమం లో హయతి ఇంట్లో ఉన్న కుక్క మొరగడంతో అది ఆలా మొరగడానికి కారణం తానే అంటూ డింపుల్ హయతి ఆమె భర్త డేవిడ్ ప్రియాంకపై విరుచుకు పది అనరాని మాటలు అన్నారని ఆమె తెలిపింది.అంతేకాదు తనను వివస్త్రను చేయాలనే ప్రయత్నం చేసారని చెప్పుకొచ్చింది.
ఈ విషయమై డింపుల్ హయతి పనిమనిషి.. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.గతంలో ఓ పోలీస్ ఆఫీసర్ తో కూడా డింపుల్ హయతి కి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే కదా. డింపుల్ హయతి తెలుగులో ‘గల్ఫ్’ చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలోని ‘జర జర’ ఐటెం పాటతో పాపులర్ అయింది.
పని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోగా.. అడిగినందుకు తమనే బూతులు తిడుతున్నారని వాపోతున్నారు. ‘మీరు నా చెప్పులంత వాల్యూ చేయరు.. మీరెంత.. మీ బ్రతుకెంత?’ అంటూ డింపుల్ భర్త దుర్బాషలాడినట్లు చెబుతున్నారు. ఈ వీడియోని అందరూ అందరూ షేర్ తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.