cm revanth reddy inaugurated new Scheme
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. రాష్ట్ర రాజధాని ఐన హైదరాబాద్ మహానగరంలో రూ.5లకే బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేసింది..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. రాష్ట్ర రాజధాని ఐన హైదరాబాద్ మహానగరంలో రూ.5లకే బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేసింది.. మోతీనగర్, మింట్ కాంపౌండ్ వద్ద ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు.మొదటి దశలో 60 ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.ఆ తర్వాత హైద్రాబాద్ వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టింది జీహెచ్ఎంసీ, రోజుకూ 25 వేల మందికి మిల్లెట్ టిఫిన్స్ అందించనుంది.
మెనూలో ఇడ్లీ, తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. భాగ్యనగరంలో ఇవాళ రూ.5లకే బ్రేక్ఫాస్ట్ పథకం అందుబాటులోకి వచ్చింది. మోతీనగర్, మింట్ కాంపౌండ్ వద్ద ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్ లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. తొలిదశలో 60 ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.ఆ తర్వాత భాగ్యనగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టింది జీహెచ్ఎంసీ, రోజుకూ 25 వేల మందికి మిల్లెట్ టిఫిన్స్ అందించనుంది.
మెనూలో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీలు, పొంగల్ ఉండనున్నాయి. ఒక్కో ప్లేట్కుకు రూ.19ల ఖర్చు అవుతుండగా రూ.14లను భరించనుంది జీహెచ్ఎంసీ. ఈ క్యాంటీన్లు వారానికి ఆరురోజులు అందుబాటులో ఉంటుంది. ఆదివారం మాత్రం సెలవు ఉంటుంది. ఇప్పటికే 150 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రూ.5లకే మధ్యాహ్న భోజనం అందిస్తోంది బల్దియా..మింట్ కాంపౌండ్లో ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని కోలుకోలేని విధంగా గత ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. మేము ఇప్పుడు ఎవరినీ బద్నామ్ చేయాలని అనుకోవడం లేదని దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అప్పుడు గరీబీ హటావో నినాదం ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు అందుకు అనుగుణంగా తమ ప్రభుత్వ పాలనా సాగుతోందని అన్నారు.ఈ పథకం కోసం 200 యూనిట్ల పవర్ ఇస్తున్నామని ఐదు వందలకే గ్యాస్ ఇవ్వబోతున్నామని ప్రకటించారు.