Cm revanth Reddy Done Dusshera in Own Village
స్వగ్రామానికి CM రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికిన అచ్చంపేట MLA డాక్టర్ వంశీకృష్ణ గారు..
TPCC ఉపాధ్యక్షులు & అచ్చంపేట MLA డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ గారు..
ఈ సందర్భంగా MLA గారు మాట్లాడుతూ..
రైతు ప్రస్థానం: నల్లమల ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర మఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారు తన స్వగ్రామమైన అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామానికి చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కొండారెడ్డి పల్లికి చేరుకున్న సీఎంకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. హెలిపాడ్ నుంచి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు ర్యాలీగా వచ్చిన రేవంత్ రెడ్డి గారిపై గ్రామస్థులు పూల వర్షం కురింపించారు. గజమాల వేల స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ సాయంత్రం గ్రామంలో జరిగే శమీ పూజ, దసరా ఉత్సవాల్లో సీఎం పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి హోదాలో స్వగ్రామంలో దసరా వేడుకలు నిర్వహించుకోవడం రేవంత్ రెడ్డి గారికి ఇది రెండో సారి. గతేడాది సీఎంగా మొదటిసారి స్వగ్రామానికి వచ్చి గ్రామ పంచాయతీ భవనం, సోలార్ విద్యుత్ పనులను ప్రారంభించనీ తెలిపారు..వారితో పాటు నాగార్జున సాగర్ శాసన సభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి గారు, దేవరకద్ర శాసన సభ్యులు G. మధుసూదన్ రెడ్డి గారు పాల్గొన్నారు..