ఉద్యాన వాన పంటలను పందేనిచే రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం | Ap Govt Good News To Horticultural crop Farmers 2025

Ap Govt Good News To Horticultural crop Farmer

ఏపీ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పూల తోటలు ,కూరగాయల సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కూరగాయలు, పండ్లు, పూల తోటలను సాగుచేసే రైతులకు రాష్ట్ర ఉద్యాన శాఖతో కలసి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) మద్దతు ఇవ్వనుంది.

ఏపీలో కూరగాయలు, పూల తోటల యొక్క సాగుని పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కీలకంగా నిలిచింది.ఈ ప్రాజెక్టులో భాగంగా, కూరగాయలు, పూల తోటల సాగుని రైతులకు మరింత దగ్గరగా అందుబాటులోకి తెచ్చేందుకు 50 శాతం రాయితీతో షెడ్డు నెట్లు ఇవ్వనున్నారు. డీఈనికోసం ప్రాథమికంగా శ్రీకాకుళం,గుంటూరు,చిత్తూరు, విజయనగరం జిల్లాలను ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు.

ఈ జిల్లాలలోని రైతుల సాగు విధానాలు, ఆదాయాన్ని అధ్యయనం చేసి, తర్వాత మిగతా జిల్లాల్లో కూడా దీన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రత్యేకంగా, డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళా రైతులకు ఈ సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు.రైతులకు 70 వేల రూపాయల వరకు ఆదాయం వచ్చే విధంగా 400 నుంచి 500 మీటర్ల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కూరగాయలు పూల తోటలను సాగు చేసేలా షెడ్డు నెట్టలను అందించనున్నారు.

ఈ సాగు విధానానికి సుమారు 2.15 లక్షల రూపాయల వ్యయం అంచనా వేస్తున్నారు. దీనికి 50 శాతం రాయితీగా, లక్ష రూపాయల వరకు ప్రభుత్వం సబ్సిడీగా అందించనుంది. మిగిలిన మొత్తాన్ని సెర్ఫ్ ద్వారా బ్యాంకులకంటే తక్కువ వడ్డీతో రుణం రూపంలో అందిస్తారు.అలాగే ఎస్సీ, ఎస్టీ రైతులకు వడ్డీలేని రుణం అందించే ‘ఉన్నతి పథకం’ కూడా లభ్యం అవుతుంది. ఇతర వర్గాల రైతులకు తక్కువ వడ్డీతో రుణం అందించనున్నారు.ఈ విధంగా, రైతులు సాగు పూర్తయ్యేసరికి 60 నుంచి 70 వేల రూపాయల వరకు ఆదాయం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Leave a Comment