మరో సారి జమ కానున్న దీపం 2 పథకం | Good News to Deepam 2 Scheme Beneficiaries 2025

Good News to Deepam 2 Scheme Beneficiaries

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘దీపం-2’ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.1,704 కోట్ల సబ్సిడీని విడుదల చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి వెల్లడించారు.శాసనమండలిలో ‘సూపర్-6’ హామీలపై జరిగిన చర్చలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు . రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.04 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది ఆయన స్పష్టం చేశారు.

ఈ పథకం మొదలైన నాటి నుంచి లబ్ధిదారులకు 2.55 కోట్ల గ్యాస్ సిలిండర్లను రీఫిల్ చేసినట్లు మంత్రి నాదెండ్ల వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడమే లక్ష్యంగా దీపం-2 పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. లబ్ధిదారులు సిలిండర్ బుక్ చేసుకుని, డెలివరీ తీసుకున్న వెంటనే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

సెప్టెంబర్ 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన కుటుంబాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తుచేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని 23,912 గిరిజన కుటుంబాలు వినియోగిస్తున్న 5 కిలోల గ్యాస్ సిలిండర్లను 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్లుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని దీనికోసం అని రూ.5.54 కోట్ల అంచనా వ్యయంతో 16 జిల్లాల్లోని గిరిజన కుటుంబాలకు ఈ ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.

పథకం అమలు తీరును వివరిస్తూ, తొలి రౌండ్‌లో రూ.764 కోట్లు, రెండో రౌండ్‌లో రూ.790 కోట్లు విడుదల చేశామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మూడో రౌండ్ (ఆగస్టు-నవంబర్) కోసం ఇప్పటికే రూ.150 కోట్లు విడుదల చేయగా, మొత్తం రూ.867 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కట్టెల పొయ్యిపై ఆధారపడటాన్ని తగ్గించి, మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Leave a Comment