Aadhar Card Download in the Whats App
ఆధార్ ఇప్పుడు దేశంలో ఎక్కుక్కువగా వాడకం లో ఉన్న ఏకైక పత్రం ఈ డాక్యుమెంట్ అనేది మనలో ఎంతలా ఇమిడిపోయింది అంటే ఈ పత్రం లేక పొతే తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణం కూడా చేయలేము అంతలా మారిపోయింది.ఆ డాక్యుమెంట్ గుసరించి ఇప్పుడు మాట్లాడుకుందాం
ఆధార్ కార్డు ఇప్పుడు కేవలం చిరునామ్ కోసమే కాదు ప్రతి పథకానికి ప్రతి ఉద్యోగానికి ప్రతి చిన్న విషయానికి కూడా ఆధార్ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్ ఇది లేకపోతేయ్ మనకు ఏ పని కూడా జరగదు.అలంటి ఆధార్ కార్డు ఎక్కడైనా పొతే !లేదా మనకు అత్యవసర పరిస్థితుల్లో మన వెంటా లేకపోతేయ్ మన పరిస్థితి ఏంటి మనం ఆ పరిస్థితిల్లో ఎలా !
అందుకే ప్రభుత్వం కొత్త టెక్నాలజీని వాడుకునే ఎలాంటి డాక్యుమెంట్ ఐన సులబాహంగా పొందే విధంగా ఒక కొత్త పద్దతిని అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ విధానం ద్వారా మీ డాకుమెంట్స్ సులభనగా మీ వాట్స్ అప్ ద్వారా పొందొచ్చు.ఇంతకు ముందు మనం ఆధార్ కార్డు ను ఉడాయి పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం కానీ ప్రభుత్వం ఆధార్ కార్డు యాక్సెస్‌ను సులభతరం చేయడానికి, ప్రజలు తమ ఆధార్‌ను నేరుగా వాట్సాప్ (WhatsApp) ద్వారా డౌన్లోడ్ చేసుకునే కొత్త ఫీచర్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది సర్వీస్ అధికారిక మైగవ్ (MyGov) హెల్ప్ డెస్క్ చాట్‌బాట్ ద్వారా అందుబాటులో ఉంది.
దీంతో వివిధ యాప్‌లు మరియు వెబ్సైట్ల ద్వారా ఆధార్ పొందాల్సిన పని లేదు.ఇప్పటి వరకు యూఐడీఏఐ పోర్టల్ లేదా డిజిలాకర్ ద్వారా ఆధార్ డౌన్లోడ్లు సాధ్యమయ్యేవి. తాజా ఫీచర్‌తో వాట్సాప్‌లోనే ఆధార్ డౌన్లోడ్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే, ఈ సేవను ఉపయోగించడానికి, కార్డుదారులు తమ ఆధార్‌తో లింక్ చేసిన డిజిలాకర్ ఖాతాను కలిగి ఉండాలి. వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. మైగవ్ హెల్ప్ డెస్క్ +91-9013151515 నంబర్ ద్వారా పనిచేస్తుంది.
స్టెప్ బై స్టెప్
- మొదట మీ మొబైల్ లో mygov యొక్క ఆధికారిక ఫోన్ నెంబర్ ని 9013151515 సేవ్ చేసుకోవాలి
- ఆ తరువాత మీ వాట్స్ అప్ నుంచి ఈ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయాలి.
- చాట్ బాట్ ద్వారా షేర్ చేసిన ఎంపికల నుండి డిజిలాకర్ సేవలను ఎంచుకోండి.
- మీ డిజిలాకర్ ఖాతాను వెరిఫై చేసి మీ 12 అంకెల ఆధార్ నంబర్ అందించండి.
- వెరిఫికేషన్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు పంపిన ఓటీపీని ఎంటర్ చేయండి.
- వెరిఫికేషన్ పూర్తియన తర్వాత, చాట్ బాట్ అందుబాటులో ఉన్న పత్రాల జాబితాను ప్రదర్శిస్తుంది.
- ఆధార్‌ను ఎంచుకుంటే కార్డు పీడీఎఫ్ వెర్షన్ నేరుగా వాట్సాప్‌లో వస్తుంది.
Note: ఈ సర్వీస్ మీరు ఉపయోగించు కోవాలి అంటే మీరు ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క digilocker అప్ లో రిజిస్టర్ అయ్యే ఉండాలి