Good News to New Ration Card Holders
తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు టిఇసుకున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఇప్పటికే తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు అప్లై చేసుకున్న వారికే కాకుండా ఇప్ప్పుడు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తూ అప్రూవ్ కూడా చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా రేషన్ కార్డు పొందిన వాళ్లకు అధికారులు ముఖ్యమైన అప్డేట్ ఇచ్చారు.
కొత్త రేషన్ కార్డులు పొందినవారు ప్రతి ఒక్కరు ఈ-కేవైసీ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. లేకపోతే రేషన్ సరకులు అందవు అని అధికారులు చెబుతున్నారు . రేషన్ దుకాణాల్లోని ఈ-పోస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.ఇటీవలే కొత్తగా రేషన్ కార్డులు వచ్చినవాళ్లకు… ఈనెల నుంచే రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు. అయితే షాపుల వద్దకు వెళ్లిన వారు ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.పాత కార్డులో కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నవారు కూడా ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈకేవైసీ గడువు పూర్తి అయితే ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.ఈకేవైసీ కోసం వెళ్లే వారు ఆధార్ కార్డులో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. లేకపోతే ఈకేవైసీ ప్రాసెస్ లో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అన్ని సరిగా చూసుకోవాలి.కొత్త రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ చేయించుకోవాలని, సదరు ప్రక్రియకు తుది గడువు రాలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు వివరించారు.ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసింది. జూలై 25 నుంచి ఆగస్ట్ 10 వరకు వీటిని అందజేసింది.
అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి… కొత్త కార్డులను కూడా మంజూరు చేస్తున్నారు.మరోవైపు కొత్త రేషన్ కార్డుల స్టేటస్ ను తెలుసుకునేందుకు పౌరసరఫరాల శాఖ వెబ్ సైట్ (https://epds.telangana.gov.in/FoodSecurityAct/) 2 సంప్రదింవచ్చు. ఏమైనా మార్పులు చేర్పులు కూడా మీసేవా కేంద్రాల ఆధారంగా సవరించుకోవచ్చు.