గత ఐదు నెలలుగా జీతాలు పొందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు | Struggled No Salaries since Five Months 2025

Struggled No Salaries since Five Months

TSWAN మరియు వీడియో కాన్ఫరెన్స్ ఇంజినీర్లకు 5 నెలలుగా జీతాలు లేకుండా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు – సంబంధిత ఏజెన్సీ ద్వారా ఇప్పించాలని, లేనిచో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

సూర్యాపేట జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో, మండల రెవెన్యూ అధికారి కార్యాలయాల్లో పనిచేస్తున్న TSWAN మరియు వీడియో కాన్ఫరెన్స్ సాంకేతిక నిపుణులు గత ఐదు నెలలుగా జీతాలు పొందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరు తమ ఏజెన్సీ అయిన అక్షర ఎంటర్‌ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నియమించబడి అన్ని ప్రభుత్వ శాఖలలో జిల్లాలో, మండలాల్లో సేవలు అందిస్తున్నారు.ఈ సిబ్బందికి గత అయిదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం వల్ల వారు తీవ్ర ఆర్థిక సంక్షోభానికి లోనయ్యారు. ఇంటి ఖర్చులు, విద్య, వైద్య ఖర్చులు కూడా భరించలేని స్థితికి చేరుకున్నారు. చాలా మంది సిబ్బంది ఆర్థిక ఇబ్బందుల వల్ల బయటకు కూడా రావలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితులలో వారు వారి సేవలను కొనసాగించడం కూడా-day-to-day బాధ్యతలు నిర్వహించడం కూడా చాలా కష్టంగా మారిందని తెలిపారు.దీని వల్ల వాళ్ళు ప్రభుత్వానికి వాళ్ళ సేవలు అందించలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

ఈ విషయంలో ఏజెన్సీ యాజమాన్యం (Akshara Enterprises India Pvt. Ltd.) Government నుండి బిల్లు రాలేదని సమాధానం చెప్తూ పలుమార్లు జీతాలు ఇదుగో ఈ నెల చెల్లిస్తామని, అదుగో వచ్చే నెల చెల్లిస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.ఈ నేపథ్యంలో సిబ్బంది ప్రతినిధులు, సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గారికి మరియు టిఎన్‌జిఒస్ జిల్లా కార్యదర్శి గారికి వినతిపత్రం అందజేశారు. తమ జీతాల విషయంలో తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని, ఏజెన్సీపై ఒత్తిడి తీసుకుని వచ్చి జీతాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.సాంకేతిక సిబ్బంది ఆర్థికంగా బలహీనపడితే, ప్రభుత్వ డిజిటల్ సేవలు కూడా అంతరాయం కలుగుతాయని హెచ్చరిస్తున్నారు.

సిబ్బందికి న్యాయం జరగకపోతే, వారు ఇతర మార్గాలు అన్వేషించాల్సి వస్తుందని, దీని ప్రభావం జిల్లా పరిపాలనపై పడవచ్చని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా TNGOs కార్యదర్శి దున్న శ్యామ్ గారు, జిల్లా ఇంజనీర్లు (TSWAN & VC) A.నవీన్ కుమార్, P.శ్రీను మరియు మండల ఇంజనీర్లు N.ప్రేమానందం, వెంకట్, సైదులు, మధు, శంకర్, నగేష్ పాల్గొనడం జరిగింది.

Leave a Comment