Bihar batch beats up Suryapet police 2025
సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం
పోలీసులను తరిమి కొట్టిన బీహార్ కార్మికులు
నష్ట పరిహారం కావాలన్నా బీహార్ కార్మికులు
రైతు ప్రస్థానం డెస్క్ : సూర్యాపేట జిల్లాలో పోలీసులను బీహార్ కార్మికులు తరిమికొట్టిన సంఘటన వెలుగు చూసింది.దీంతో ఒక్కసారిగా పోలీస్లతో సూర్యాపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లాల్లోని పాలకీడు గ్రామంలో ఉన్న డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బీహార్ కార్మికుడు ఐన వినోద్ ఆదివారం కంపెనీ సెలవు దినాం కావడంతో తన గది బయట బట్టలు వాష్ చేసుకుంటూ ఒక్కసారిగా కింద పడిపోయాడు.
దీంతో తోటి కార్మికులు అంత కలిసి హాస్పిటల్కు తీసుకుని వెళ్లగా హాస్పిటల్ సిబ్బంది మెరుగైన వైద్యం కోసం తరలించాలి అనగా దగ్గరలోని మిర్యాలగూడకు షిఫ్ట్ చేస్తుండంగా మార్గ మధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు.తోటి కార్మికుడు చనిపోవడంతో నష్ట పరిహారం కావాలని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదురుగా శాంతి యూథా ధర్నాకు దిగారని వీళ్ళతో పాటుగా అల్లరి ముక్కాలు చేరి సమ్మె కాస్తా గాంధార గోళంగా మార్చడంతో అక్కడి సిబ్బంది మాకు ఫోన్ చేసి ధర్నా చేస్తున్నారు అనడంతో మా కానిస్టేబుల్స్ వచ్చి సమ్మె విరమించామనడంతో దాడికి దిగారని జిల్లా sp నరసింహ తెలిపారు.ఈ విషయంపై గట్టిగా స్పందించిన ఆయన దాడి చేసిన నిందితుల కోసం గాలింపు చెర్యలు చేపట్టారు.ఈ ఘటనతో డెక్కన్ సిమెంట్ పరిసర ప్రాంతాలలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.