Telangana Released 2 new Schemes for minority
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కొత్త పథకాలను ప్రవేశ పెట్టిండి ఈ పథకాల ద్వారా ప్రతి ఒక్కరు 50 వేళా నుండి లక్ష వరకు అందిస్తుంది.ఈ పథకాలకు ఎవరు eligible ఎవరు ఎలాంటి డాకుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ప్రజల బాగుకోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 2 పథకాలను అందుబాటులోకి తీసుకుంవచ్చింది.ఈ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి 50 వేళా నుండి లక్ష వరకు అందివ్వనుంది.ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చిన
ఆ రెండు పతాకాలు చూసుకున్నట్లైతే
- ఇందిరా మైనారిటీ మహిళా యోజన
- రేవంత్ అన్న కా సహారా మిస్కిన్ల స్కీం (రేవంత్ పేదల ఆర్థిక సహాయ స్కీం )
ఇందిరా మైనారిటీ మహిళా యోజన
ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలను ఆర్ధికంగా బలపరచడం.వితంతువులు,విడాకులు పొందిన వారు,ఆర్ధికంగా బలహీనంగా ఉన్న మహిళలకు ఉపాధి కల్పించి చిన్న వ్యాపారాలు ,స్వయం ఉపాధి,సాంప్రదాయ వృత్తులను ప్రోత్సహించడం.
అర్హులు ఎవరు
- మైనారిటీ వర్గానికి చెందిన మహిళలు (ముస్లిం, పిక్కులు, బొడ్డులు, జైనులు, పార్సీలు మొదలైన వారు).
- వితంతువులు, విడాకులు పొందిన వారు ఆనాథలు, లేదా పేద కుటుంబాల మహిళలు
వయస్సు
18 నుండి 55 సంవత్సరాల మధ్య
కనీస విద్యార్హత
5వ తరగతి ఉత్తీర్ణత.
- కుటుంబ ఆదాయం నిర్దేశిత పరిమితిలో ఉండాలి.
- ఇప్పటికి ప్రభుత్వం నుంచి ఇలాంటి లబ్ధి పొందకపోవాలి.
అవసరమైన డాక్యుమెంట్లు
- ఆధార్ కార్డు
- కులం/ మైనారిటీ సర్టిఫికేట్
- ఆదాయ ధృవీకరణ పత్రం
- విద్యా ధృవీకరణ పత్రం (కనీసం 5వ తరగతి)
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
- బ్యాంక్ ఖాతా వివరాలు
దరఖాస్తు ప్రక్రియ
- TGOBMMS 2 (Telangana Online Beneficiary Management & Monitoring సిస్టం అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
- స్థానిక మైనారిటీ వెల్ఫేర్ ఆఫీస్/ మండల స్థాయి అధికారుల ద్వారా పరిశీలన జరుగుతుంది.
- అర్హులైన మహిళలకు ఉచిత సెలాయింగ్ మెషీన్ లేదా ₹50,000 ఆర్ధిక సహాయం మంజూరు అవుతుంది.
పథకం లాభాలు
- మైనారిటీ, మహిళలకు ఉచిత సిలాయింగ్ మెషీన్.
- చిన్న వ్యాపారం కోసం ₹50,000 ఆర్థిక సహాయం.
- మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు పెరగడం.
- మహిళల ఆత్మవిశ్వాసం పెరగడం, కుటుంబ ఆర్థిక స్థితి మెరుగవడం.
Click Here for Apply
2. రేవంత్ అన్న కా సహారా మిస్కిన్ల స్కీం (రేవంత్ పేదల ఆర్థిక సహాయ స్కీం )
రేవంత్ అన్న కా సహారా పేరుతో తీసుకువచ్చిన పథకంలో అర్హత కలిగిన మైనారిటీ లబ్ధిదారులకు మోపెడ్ లు, బైకులు, ఈ బైకులు ఇచ్చి వారికి అండగా నిలవనుంది. ఈ పథకంలో మైనారిటీ లబ్ధిదారులకు ఒకేసారి గ్రాంట్ ద్వారా ఆర్థిక సహాయం బైక్ రూపంలో అందించనుంది. ఒక్కొక్కరికి లక్ష రూపాయలు విలువైన బైక్ లను ఉచితంగా అందించనుంది.
దరఖాస్తు
- ఈ పథకంలో లబ్ధి పొందాలని భావించే మైనారిటీలు OBMMS ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
- ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి నిన్నటి నుంచి అప్లికేషన్లను తీసుకుంటుండగా ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ముగింపు తేది వచ్చే నెల ఆరవ తేదీ వరకు ఉంది.
- ఈ పథకంలో లబ్ధి పొందాలనుకుంటే దరఖాస్తుదారులు కొన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకోవటానికి కావాల్సింది ఇవే
- ముఖ్యంగా దరఖాస్తుదారులు ఫకీర్, దూదేకుల, దుర్బల ముస్లిం సమాజానికి చెందిన వారై ఉండాలి.
- వీరి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో అయితే సంవత్సరానికి లక్ష యాభై వేల రూపాయలు, పట్టణ ప్రాంతాలలో అయితే సంవత్సరానికి రెండు లక్షల రూపాయలుగా ఉండాలి.
- చిరునామా రుజువుగా దరఖాస్తుదారుని ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు జతపరచాలి.
వీరు అనర్హులు
- దరఖాస్తుదారుడు వయసు 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి.
- దరఖాస్తుదారుడు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి. ఇక బైక్, మోపెడ్, లేదా ఈ బైక్ కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వబడుతుంది.
- అంతేకాదు గతంలో ఐదు సంవత్సరాలుగా మైనారిటీ కార్పొరేషన్ లేదా ప్రభుత్వం నుండి సబ్సిడీని పొందిన వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
ఉచితంగా లక్ష రూపాయల విలువైన బైక్
- ఆ ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ పథకం ద్వారా వారు లక్ష రూపాయల విలువైన బైక్ ను ఫ్రీగా పొందవచ్చు.
- ఇది వీరి జీవన ప్రమాణం మెరుగుదలకు దోహదం చేస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
- ఈ క్రమంలోనే ఆయన రేవంత్ అన్న కా సహారా పేరుతో ఈ పథకాన్ని అందిస్తున్నారు.