Teja Sajja Mirai Movie Review 2025
యంగ్ హీరో తేజ సజ్జ మరో సినిమాతో ముందుకు వచ్చాడు హనుమ మూవీ తో భారీ విజయాన్ని అందుకున్న తేజ మరో కొత్త కోణంతో వచ్చిన మిరాయి మూవీ మరో విజయాన్ని అందించిందా లేదా అనేది చూద్దాం..
కళింగ యుద్ధం తర్వాత ఎంతో పశ్చాత్తాపానికి లోనైన అశోకుడు తనలోని శక్తులని మొత్తం 9 గ్రంథాలు (ఒకో గ్రంథానికి ఒకో దివ్య శక్తి కలిగి ఉంటుంది) లోకి ఇమిడింపజేసి ప్రపంచ నలు మూలాల 9 మంది రక్షకులకి అందిస్తాడు. ఈ గ్రంథాలను తరతరాలుగా కాపాడుతూ తరువాతి తరంలో రక్షకుడ్ని కూడా నియమిస్తూ ఉంటారు. అక్కడ నుంచి ప్రస్తుత కాలానికి ఒకో గ్రంథాన్ని చేజిక్కించుకొని తాను భగవంతునిగా మారాలని చూసే క్రూరుడు మహావీర్ (మంచు మనోజ్) ప్రయత్నిస్తాడు. అలా తొమ్మిదో గ్రంథం అంబిక (శ్రియా శరన్) రక్షలో ఉంటుంది.
అలా 2000 సంవత్సరంలో 9వ గ్రంథమైన అమృత గ్రంథానికి రక్షకురాలే అంబికా (శ్రియ). ఆమెకి భవిష్యత్తు చూడగలిగే శక్తి ఉంటుంది. దీంతో ఒకసారి అంబికాకి భవిష్యత్తులో 8 గ్రంథాల్ని ఒక దుర్మార్గుడు మహావీర్ (మంచు మనోజ్) సొంతం చేసుకున్నట్లు కనిపిస్తుంది. వెంటనే మిగిలిన 8 మంది గ్రంథ రక్షకులతో సమావేశం అయి విషయం చెబుతుంది.ఈ ప్రమాదానికి పరిష్కారాన్ని వెతకాలని హిమాలయాల్లోని కైలాస శిఖరాన్ని చేరుతుంది. అక్కడ ఆమెకి అగస్త్య మహాముని (జయరామ్) దర్శనమిస్తాడు. నువ్వు చూసిన ప్రమాదం నిజమే..
కానీ దాన్ని ఆపాలంటే దానికి ఒక త్యాగం కావాలి.. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని త్యాగం చేయగలవా అంటూ అగస్త్యుడు అడుగుతాడు. దీంతో మానవాళి శ్రేయస్సు కోసం అంబికా దానికి అంగీకరిస్తుంది. దీంతో సరిగ్గా నీ బిడ్డ పుట్టిన 24 ఏళ్లకి అతనికి తన ధ్యేయం ఏంటో తెలుస్తుంది. ఆ దుష్టశక్తిని ఆపగలిగే ఆయుధం కోసం తన ప్రయాణం మొదలవుతుంది అంటూ అగస్త్యుడు చెబుతాడు.మరి దానికి తన కొడుకు వేద (తేజ సజ్జ) ఎలా రాముని కాలానికి చెందిన మిరాయ్ ని చేజిక్కించుకొని రక్షకుడిగా మారాడు. తాను వేద నుంచి యోధ గా ఎలా పరిణామం చెందాడు? ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? చివరికి ఆ తొమ్మిదో గ్రంథం మహావీర్ కి దక్కకుండా చేశాడా లేదా? అసలు ఆ మిరాయ్ ఏంటి? మహావీర్ గతం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి..