Revanth Reddy Good news to NewRation Cards
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్న వారు సెప్టెంబర్ నుండి డబుల్ ధమాకా ఇప్ప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్నా వారికి సెప్టెంబర్ నుండి డబుల్ ధమాకా అందనుంది.దీంతో ప్రతి ఒక్కరికి సవయంగానే రేషన్ బియ్యం అందనున్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం అందిస్తూ వస్తుంది ఇప్పటికే 3 నెలల రేషన్ మొత్తాన్ని ఒకే నెలలో అందించింది.కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్న వారికి ఒకేసారి మూడు బొనాంజాలు ప్రకటించింది. దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక మూడు బొనాంజాల విషయానికి వస్తే. వీటిల్లో మొదటిది ఏంటంటే.. మూడు నెలల రేషన్ పంపిణీ తర్వాత.. సెప్టెంబర్ నుంచి మళ్లీ రేషన్ పంపిణీ మొదలు కానుంది.

మల్లి సెప్టెంబర్ నుంచి కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్న వారితో కలిపి మల్లి రేషన్ బియ్యాన్ని ఇవ్వడానికి రాష్ట్రం చూస్తోంది. సెప్టెంబర్ 1 నుండి కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్న వారికి రేషన్ బియ్యం అందనుండఁగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిన ఆరోగ్య శ్రీ 10 లక్షలు ఈ సెప్టెంబర్ నుండే వర్తింపు చేయనుంది.ప్రస్తుతం కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారి పేర్లు ఆరోగ్యశ్రీ వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. వారం, పది రోజుల్లో ఈ పని పూర్తవుతుందని సమాచారం.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 461 ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు లభిస్తున్నాయి. కొత్తగా కార్డు పొందిన వారు సెప్టెంబర్ నెల నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని పొందేందుకు అర్హులవుతారు. దీని ద్వారా వీరికి 10 లక్షల రూపాయల మేర లబ్ధి చేకూరనుంది.సెప్టెంబర్ నుంచి రేషన్ కార్డుదారులకి ప్రత్యేక రేషన్ బ్యాగులని ఉచితంగా ఇవ్వనున్నారు. పర్యావరణానికి మేలు చేసే, తెల్లని రేషన్ బ్యాగుల ధర బయట రూ.50 నుంచి రూ.30 దాకా ఉంటుంది. అయితే సెప్టెంబర్ నుంచి ప్రభుత్వం వీటిని ఉచితంగానే ఇవ్వబోతుంది. ఇకపై రేషన్ లబ్దిదారులు ప్రతి నెల ఈ బ్యాగుల్లోనే రేషన్ బియ్యం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.