How to Apply for UDID certificate for Disability persons
వైకల్యం ఉన్న వారిని గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేయడం కోసం ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి సదరం క్యాంప్స్ అని నిర్వహిస్తూ వస్తుంది.
Over view
చాలామంది ప్రజలు తమ అవయవాలని కోల్పోయి ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు మరి కొంత మంది ఐతే తమ అవయవాలను కోల్పోయి తమ పని కూడా తాము చేసుకోలేక పక్కా వారిపై ఆధార పడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు.దీని వల్ల వారు పని చేసుకోలేక తమ పక్క వారు వాళ్ళని చూసుకుంటూ వారు పని చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులకు కూడా గురి అవుతున్నారు.కాబట్టి వీళ్ళను ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం నుండి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం వారికి పెన్షన్ రూపం లో నెల నెల కొంత మొత్తంలో ఆర్థికంగా సహాయం చేస్తూ వస్తుంది.వైకల్యం ఉన్న వారిని గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేయడం కోసం ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి సదరం క్యాంప్స్ అని నిర్వహిస్తూ వస్తుంది.ఈ క్యాంప్స్ ద్వారా వైకల్యం ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వం ఆమోద ముద్రను వేసి వారికి పేపర్ (వ్రాత పూర్వకంగా) ఒక ధ్రువపత్రాన్ని అందిస్తుంది.ఈ ప్రతి ద్వారా అర్హత ఉన్న వ్యక్తి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే ప్రభుత్వం వారికి పెన్షన్ ఇవ్వడం చేస్తుంది.
సదరం స్లాట్స్ ఇబ్బందులు
ప్రతి రాష్ట్రం 3 నెలలకు ఒకసారి మాత్రమే లిమిటెడ్ స్లాట్స్ తో సదరం క్యాంపులు ఏర్పాటు చేస్తుంది.దీనిలో సర్వర్ రావడం లేదని కొద్ది సేపు,సరైన పత్రాలు లేవని మరి కొంత మందిని వెనుకకు పంపిస్తూ ఉంటారు.మీసేవ నిర్వాహకులు దీని ద్వారా స్లాట్స్ నిర్ణీత గడువు లోపు బుక్ అవ్వక స్లాట్స్ కంప్లీట్ అయ్యి ఎక్కువ మోతాదులో ప్రజలు నిరాశ నిస్పృహలకు గురి అవుతున్నారు.దీంతో కేంద్ర ప్రభుత్వం కలుగ చేసుకుని స్లాట్ బుకింగ్ కోసం కొత్త వెబ్సైట్ ను అందుబాటులోకి తెచ్చింది.దీని ద్వారా సదరం సర్టిఫికేట్ పొంది ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పొందవచ్చు.
UDID
కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రతి ఒక్క వికలాంగుడిని ఒక్క దగ్గరికి చేర్చి వారికి వైకల్యం సర్టిఫికేట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది.ఇప్పటికే 2 లక్షల మందికి డిసబులిస్టి సర్టిఫికేట్ ఇచ్చింది.
సదరం సర్టిఫికేట్ లేకుండా UDID కి అప్లై చేయొచ్చ
కేంద్రం ఈ పథకం కింద ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అర్హులుగా తేల్చింది.మీకు మీ ప్రభుత్వం అందిస్తున్న వైకల్యం సర్టిఫికేట్ ఉన్న లేకున్న మీరు ఐతే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.
ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు.
1. మీకు సదరం సర్టిఫికేట్ ఉన్న ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు.
2. మీకు ఏవిధమైన వైకల్యం ఉన్న అప్లై చేసుకోవచ్చు
3. మీకు ఇంతకు ముందు సదరం క్యాంప్స్ లో మీ దరఖాస్తు రిజెక్ట్ అయినా ఇక్కడ అప్లై చేయండి
4. మీకు UDID ద్వారా అప్లికేషన్ పెట్టిన అక్కడ కూడా రిజెక్ట్ అయినా మళ్ళీ అప్లై చేసుకోవడానికి వీలు ఉంది.
5. ఇంతకుముందు మీరు ఎప్పుడూ కూడా సదరం క్యాంప్స్ కి వెళ్ళకున్న లేదా మీకు సదరం క్యాంప్స్ కు అప్లై చేసుకున్న ఇక్కడ అప్లై చేయండి.
అప్లోడ్ చేయవలసిన పత్రాలు
1. పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
2. సంతకం (signature)
3. చిరునామా
4. ఆధార్ కార్డు
5. వైకల్యం సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయాలి
6. క్యాస్ట్
అప్లై చేయడం ఎలా
ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. డెమో వీడియో ఇక్కడ ఇవ్వడం జరిగింది.