సూర్యాపేటకు రైల్వే జంక్షన్ రూ.7.40 కోట్లు కేటాయించింది | Railway Line allocates Rs. 7.40 crore for Srpt

Table of Contents

Railway Line allocates Rs. 7.40 crore for Srpt

సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే కనెక్టివిటీ కోసం ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తు న్నారు.

బడ్జెట్లో పొందుపరిచింది. తాజాగా ఆ కొత్త లైన్ ఎఫ్ఎల్ఎస్కు కేంద్రం రూ.4.71 కోట్లు కేటాయించింది.

మరోవైపు 296 కిలోమీటర్ల పొడవున సూర్యా పేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి మీదు గా గద్వాల వరకు డోర్నకల్ – గద్వాల

సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే కనెక్టివిటీ కోసం ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గతంలో పలుమార్లు కొత్త రైల్వే లైన్లను ప్రతిపాదించినా అవి కాగితాలకే పరిమితమ య్యాయి. అయితే, విశాఖపట్నం నుంచి విజయవాడ, సూర్యాపేట మీదుగా శంషాబాద్ వరకు, అదేవిధంగా విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూల్కు హైస్పీడ్ రైల్వే కారిడార్ కోసం ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ (పెట్) సర్వేను చేపట్టింది. ఆ సర్వే గతేడాది చివరలో పూర్తి కావడంతో దానిని ఈ ఏడాది

బడ్జెట్లో పొందుపరిచింది. తాజాగా ఆ కొత్త లైన్ ఎఫ్ఎల్ఎస్కు కేంద్రం రూ.4.71 కోట్లు కేటాయించింది. ఇది కార్యరూపం దాల్చితే గం టకు 220 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్ రైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు 296 కిలోమీటర్ల పొడవున సూర్యా పేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి మీదు గా గద్వాల వరకు డోర్నకల్ – గద్వాల కొత్త రైల్వే లైన్ ఎఫ్ఎల్ఎస్కు ఓకే చెప్పింది. దానికి రూ.7.40 కోట్లు కేటాయించింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ ఏర్పడనుంది.

కొత్త లైన్లు, డబ్లింగ్ పనులకు నిధులు ఇలా..
  • మాచర్ల నుంచి నల్లగొండ వరకు 92 కిలోమీటర్లు పొడవునా రూ.458.26 కోట్లతో కొత్త రైల్వే లైన్కు ఓకే చెప్పింది. దానికి సంబంధించిన సేఫ్టీ పనుల కోసం రూ.20 లక్షలు కేటాయించింది.
  • రూ.77.80 కోట్లతో విష్ణుపురం నుంచి జాన హాడ్ వరకు 11 కిలోమీటర్ల పొడవునా కొత్తలైన ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. దీనికి సేఫ్టీ ఫండ్స్ కింద రూ.5 కోట్లు కేటాయించింది.
  • జగ్గయ్యపేట నుంచి మేళ్లచెరువు వరకు 19.1 కిలోమీటరు పొడవునా కొత్త లైన్కు ఓకే చెప్పిం ది. దాంతోపాటు మేళ్లచెరువు-జాన్పడ్ లైన్ 24 కిలోమీటర్ల పొడవునా ఆధునుకీకరణ పను లకు రూ.513.20 కోట్లు కేటాయించింది.
  • ఘట్కేసర్ నుంచి బీబీనగర్ వరకు 14.25 కిలోమీటర్ల పొడవునా 3, 4 లైన్ల డబ్లింగ్ చేసేందుకు ఎఫ్ఎల్ఎస్కు ఓకే చెప్పింది. ఇందుకు రూ.29 లక్షలు కేటాయించింది.
  • భువనగిరి- బీబీనగర్ మధ్య 15 కిలోమీటర్ల పొడవునా 3వ లైన్ డబ్లింగ్కు ఎఫ్ఎల్ఎస్కు రూ.30 కోట్లు కేటాయించింది.
  • ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్ -2 విస్తరణకు ఓకే చెప్పింది. దీనికి వివిధ పద్దుల కింద రూ. 110 కోట్లు కేటాయించింది.
  • అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద యాదాద్రిలో ర్యాంపులతో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులను కేటాయించింది. అలాగే యాదాద్రిలో 4 కిలోమీటర్ల పొడవునా బైపాస్, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ఎఫ్ఎల్ఎస్కు ఓకే చెప్పింది.
  • గుంటూరు- బీబీనగర్ మధ్య డబ్లింగ్కు సంబం ధించిన ఎఫ్ఎల్ఎస్కు రూ.3.10 కోట్లు, బీబీనగ ర్-భువనగిరి మధ్య డబ్లింగ్ కోసం ఎఫ్ఎల్ ఎస్కు రూ.30 లక్షలు కేటాయించింది.
  • గుంటూరు బీబీనగర్ మధ్య రూ.2,83 కోట్లతో చేపట్టే డబ్లింగ్కు, రూ.110.83 కోట్లతో విష్ణుపురం వద్ద బైపాస్ లైన్ నిర్మాణానికి ఒకే చెప్పింది.
  • మోతుమర్రి- విష్ణుపురం మధ్య డబ్లింగ్కు నిధు లను కేటాయిచింది.
  • రూ.3.32 కోట్లతో మిర్యాలగూడ గూడ్స్ షెడ్మ అభివృద్ధి చేయనుంది.

Leave a Comment