స్వాతంత్ర్య సమరయోధుల సేవలు చిరస్మరణీయం | The services of freedom fighters are memorable 2025

The services of freedom fighters are memorable

స్వాతంత్ర్య సమరయోధుల సేవలు చిరస్మరణీయం
సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి

డోన్ పట్టణం లో సామాజిక కార్యకర్త పి.మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో మే 20 న మన దేశ స్వాతంత్ర్యసమరయోధులు శ్రీ బిపిన్ చంద్రపాల్ గారి వర్ధంతి సందర్బంగా మరియు స్వాతంత్ర్య సమర యోధులు ఆంధ్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతులను పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘణంగా నివాళ్ళు అర్పించి వారిని స్మరించుకున్నారు.

ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి మాట్లాడుతూ*మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని , సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు. శ్రీ బిపిన్ చంద్ర పాల్ నవంబరు 7, 1858 న బంగ్లాదేశ్ లో జన్మించారు. ఈయన సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు లాల్ బాల్ పాల్ త్రయంలో మూడవ వాడు. జాతీయోద్యమ పత్రిక వందేమాతరం ను మొదలు పెట్టాడు. తెలుగువారితో సహా ఎందరో భారతీయులను స్వాతంత్ర్య సమర మందు ఉత్తేజితులను చేసాడు. బ్రహ్మసమాజంలో చేరి ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ప్రజలను ఉత్తేజపరిచే ఉపన్యాసకుడిగా పేరొందారు. వందేమాతరం ఉద్యమ వ్యాప్తిలో భాగంగా రాజమండ్రిలో ఈయన ప్రసంగించిన ప్రాంతాన్ని ‘పాల్‌ చౌక్‌’ అని పిలుస్తున్నారు.మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల ఈయన ఉపన్యాసాల ప్రభావంతోనే ఏర్పాటు చేయబడింది. ట్రిబ్యూన్‌, న్యూ ఇండియా, వందేమాతరం మొదలైన పత్రికల్లో ఈయన రచనలు ఎన్నో ప్రచురింపబడినాయి.

ఆనాటి రాజకీయాల్లో ప్రధాన పాత్రధారులైన లాలా లజపతిరాయ్‌, బాలగంగాధర్‌ తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌ అనే నాయక త్రయాన్ని ‘లాల్‌, బాల్‌, పాల్‌’ అని సగౌరవంగా పిలిచేవారు. శ్రీ బిపిన్ చంద్ర పాల్ మే 20, 1932 స్వర్గస్తులైనారు.ఇలాంటి మహనీయులైన స్వాతంత్ర్య సమరయోధులను ఎల్లవేళల స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్తలు డోన్ పి. మహమ్మద్ రఫి కోరారు.శ్రీ టంగుటూరి ప్రకాశంపంతులు 1872 ఆగష్టు 23 న ప్రకాశంజిల్లా వినోదరాయునిపాలెముగ్రామంలోని యోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు. ఈయన సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు. వారి ఆశయాలను, నిరాడంబరతను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి పేర్కొన్నారు. ఆయన పేద కుటుంబంలో జన్మించినప్పటికీ కృషి, పట్టుదలతో న్యాయవాదిగా ఎదిగి మద్రాస్, ఢిల్లీలలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించారని అన్నారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో మద్రాసులో సైమన్ కమిషన్‌కు ఎదురు తిరిగి బ్రిటీష్‌వారి తుపాకులకు ఎదురు నిలిచి గుండె చూపి తనను కాల్చమని ధైర్యంగా నిలిచిన వ్యక్తి ప్రకాశం పంతులు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రకేసరి గా బిరుదు పొందిన వ్యక్తిగా ఆయన్ను కొనియాడారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో టంగుటూరు ప్రకాశం పంతులు పాత్ర కీలకమైందన్నారు. 1916 నుంచి ప్రతి ఉద్యమంలో పాలుపంచుకున్నారని తెలిపారు. 1928లో సైమన్ కమిషన్ గోబ్యాక్ అనే నినాదంతో ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ ఉద్యమంలో బ్రిటీష్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తన ఛాతిని తుపాకీ గుండ్లకు ఎదురు నిలిచి చూపించారని, దీంతో ఆయన ఆంధ్రకేసరిగా పేరుపొందారని తెలిపారు.

మద్రాసు నుంచి విడిపోయిన తరువాత ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు పని చేశారని, పరిపాలనాపరంగా ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజి నిర్మాణంతో పాటు వ్యవసాయ రంగంలో, అలాగే సూక్ష్మ సేద్యంలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చారన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో సత్యాగ్రహ ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారని తెలిపారు.ఈయన 20-5-1957 న స్వర్గస్తులైనారు.ఈయన ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని ,సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫి సూచించారు.స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పోరాటాలు, త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం మన అందరి పై ఎంతైనా ఉందన్నారు.

Leave a Comment