New Ration Card Applications in Whats app 2025
కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు Mee Sevaకు వెళ్లి అక్కడ లైన్లో నిలబడి సమయం వృధా చేసుకోకుండా ఉండటం కోసం రాష్ట్ర ప్రభుత్వం సేవలతో వాట్స్ ఆప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది దీని ద్వారా సమయం వృధా కాకుండా ఉంటుంది అని తెలిపింది.
కొత్త రేషన్ కార్డుల జారీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సన్నాహాలు చేస్తోంది.వైసీపీ హయాంలో ఇప్పటికే మీసేవ ద్వారా అప్లికేషన్ చేసుకున్న వారు మల్లి అప్లై చేసుకోవాల్సిన పని లేదని తెలిపింది.కొత్త అప్లై చేసుకోవాలని తెలిపింది.
వాట్స్ అప్ ద్వారా అప్లికేషన్స్
కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు మీ సేవకు వెళ్లి అక్కడ లైన్లో నిలబడి సమయం వృధా చేసుకోకుండా ఉండటం కోసం రాష్ట్ర ప్రభుత్వం సేవలతో వాట్స్ ఆప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది దీని ద్వారా సమయం వృధా కాకుండా ఉంటుంది అని తెలిపింది.
పెండింగ్ దరఖాస్తుల పరిశీలన
వైసీపీ ప్రభుత్వం హయాంలో కొత్త రేషన్ కార్దులు మరియు పిల్లల పేర్ల ఆడ్ కోసం అర్జీ పెట్టుకున్న 3.36లక్ష ల దరఖాస్తులను పరీశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.మే 15 నుంచి వాట్సాప్లో ‘మనమిత్ర’ సేవ ద్వారా కొత్త దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించింది.
మన మిత్ర ద్వారా అప్లికేషన్స్ ఎలా
రేషన్ కార్డు అప్లై చేయాలంటే, మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ లో 95523 00009 నంబర్కు “Hi” అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియను అది స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తుంది. దరఖాస్తు తర్వాత, రేషన్ కార్డు మీ చిరునామాకు అందేలా చూస్తున్నారు.
జూన్లో కొత్త రేషన్ కార్డులు: క్యూఆర్ కోడ్తో ఆధునికీకరణ
ప్రభుత్వం తాజా నిర్ణయాల ప్రకారం, జూన్ 2025లో స్మార్ట్ ఫార్మాట్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతుంది. ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్ కూడా ఉండేలా రూపొందించనున్నారు. దీనివల్ల రేషన్ పంపిణీలో పారదర్శకత పెరగడమే కాకుండా, అవకతవకలకి అడ్డుకట్ట పడనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూత్రప్రాయంగా తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో డిజిటల్ పాలనకు ఊతమిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అందిస్తున్న సేవలు
ఈ కొత్త విధానంలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఏడు రకాల సేవలను ప్రజలకు డిజిటల్ ఫార్మాట్లో అందించబోతుంది. అవి:
1. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు
2. సభ్యులను జోడించడం (Addition)
3. పాత సభ్యుల తొలగింపు (Deletion)
4. సరెండర్
ముగింపు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వం అందిస్తున్న మన మిత్ర సేవ ద్వారా ప్రతి ఒక్కరు కొత్త రేషన్ కేసులకు మే 15 నుంచి application చేసుకోవచు దేని ద్వారా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకొని చాల సమయం పడిగాపులు లేకుండా క్షణాల్లో పని పూర్తి చేసుకోవచ్చు.
FAQ